నవతెలంగాణ – అశ్వారావుపేట : పేకాట స్థావరంపై స్థానిక పోలీసులు ఆదివారం దాడి చేశారు.స్థానిక ఎస్.హెచ్.ఒ,ఎస్సై యయాతి రాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గాండ్లగూడెం గ్రామ శివారులో గల చెరువు దగ్గర పేకాట స్థావరం నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమచారం తో దాడి చేసి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6,200 లు ఊరు నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.ఇందులో ఏడుగురిని అదుపులో తీసుకోగా 3 పరారీలో ఉన్నట్లు వివరించారు.