ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి: ఎస్ఎఫ్ఐ

– శిథిలా వ్యవస్థలో ఉన్న ప్రభుత్వ హాస్టల్లను సందర్శించి అభివృద్ధి చేయాలి..
నవతెలంగాణ- డిచ్ పల్లి
ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, శిథిలా వ్యవస్థలో ఉన్న ప్రభుత్వ హాస్టల్లను సందర్శించి నీదులను కేటాయించి వేంటనే అభివృద్ధి చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఇంటర్మీడియట్ కళాశాల నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించి తాహసిల్దార్ కు  విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిచ్ పల్లి ప్రాంతంలోని బాలికల హాస్టల్  శిధిల  వ్యవస్థలో ఉందని దానికి వేంటనే నీధులను మంజూరు చేయాలని పేర్కొన్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ తోమరమ్మత్తుల కోసం అధిక నిధులను అంచనా వేయలని అన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గత ఐదు నెలల నుండి జీతాలు రాకపోవడం బాధాకరమని, ఏజెన్సీలచే వెంటనే జీతాలు అందించేటట్టుగా కృషి చేయాలని అన్నారు. ఎస్టీ బాయ్స్ పాఠశాల విద్యార్థులకు గదులు సరిపోక ఒకే గదిలో 20 మంది నిద్రిస్తున్న పరిస్థితి దాపురించిందనీ, వెంటనే విద్యార్థులకు పక్కా భవనాలు నిర్మించాలన్నారు. లేకపోతే ఈనెల 21న ఎస్ఎఫ్ఐ జిల్లా కలెక్టరేట్  ముట్టడి నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు లవిశెట్టి ప్రసాద్, శివరాత్రి వెంకటేష్, యూనివర్సిటీ ఉపాధ్యక్షురాలు సంధ్యారెడ్డి, నాయకులు మిథున్, లక్ష్మి, ప్రజ్ఞ, ఆకాష్, తదితరులు పాల్గొన్నారు.