విద్యార్థి యువజన నాయకులను అరెస్టు చెయ్యడం సిగ్గు చేటు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ

నవతెలంగాణ- కంటేశ్వర్

నిజామాబాద్ జిల్లాకి ఐటీ& పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వస్తున్న సందర్భంలో విద్యార్థి యువజన నాయకులను(ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ )ఆక్రమంగా అరెస్టులు చేయడానికి తీవ్రంగా ఖండిస్తు ఎస్ఎఫ్ఐ -డివైఎఫ్ఐ కమిటీల అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను బుధవారం దహనం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు విశాల్ డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆశీర్వాదం మాట్లాడుతూ..  ఈరోజు ప్రభుత్వ విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అలుపెరగని పోరాటాలు చేసే విద్యార్థి యువజన నాయకులను ముందస్తుగా ఆక్రమంగా అరెస్టులు చేయడానికి తీవ్రంగా ఖండించారు.అలాగే ఏదైతే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం మన ఊరు మన బడి పథకం తీసుకొచ్చిన అది కేవలము బయటికి చూపెట్టుకోవడానికి తప్ప ఎక్కడ అమలులో కనిపించడం లేదు అని మరియు స్కాలర్ షిప్స్,ఫీ రియంబర్స్ మెంట్ సరి అయిన సందర్భంలో అందకపోవడం అదే విధంగా ప్రభుత్వ హాస్టల్లో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఇలా మంత్రి కేటీఆర్  నిజామాబాద్ జిల్లాకు ఐటి హబ్ ఓపెన్ కు వస్తున్న సందర్భంలో విద్యారంగ సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తరో చెప్పకుండా విద్యార్థి ,యువజన నాయకులను ఆక్రమంగా అరెస్టులు చేయడము సిగ్గు చేటు అని అన్నారు.అలాగే అరెస్టు చేసిన ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులను వెంటనే విడుదల చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు దీపిక గణేష్ ,రాహుల్ డివైఎఫ్ఐ నాయకులు రాహుల్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.