పాఠశాల భవనంపై పేరు లేకుండా కొనసాగుతున్న శంషాబాద్‌ రవీంద్ర భారతి స్కూల్‌ ఎమ్మార్పీ లేకుండా పాఠ్యపుస్తకాల విక్రయాలు

ఇష్టానుసారం ఫీజుల దోపిడీ
పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టిన ఎస్‌ఎఫ్‌ఐ
పుస్తకాలు అమ్ముతున్న గది సీజ్‌
పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కే. వై. ప్రణరు
నవతెలంగాణ – శంషాబాద్‌
ఏ లక్ష్యంతో నిర్వహించే సంస్థ అయినా ఖచ్ఛితంగా నిర్వహించే భవనంపైన తమ సంస్థ పేరు రాసుకోవడం ఆనవాయితీ. విద్యా సంస్థలైతే ఆ విద్యా సంస్థ పేరు రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ గుర్తింపు ఇచ్చిన రాష్ట్రం పేరు నిర్వహిస్తున్న భవనం పై రాస్తారు. కానీ ఇవేవీ ఆ విద్యా సంస్థ పట్టించుకున్న దాఖలాలు లేవు. శంషాబాద్‌లోని మధురనగర్‌ కాలనీలో పేరెన్నికగన్నా కార్పొరేట్‌ విద్యా సంస్థ రవీంద్ర భారతి స్కూల్‌ తీరు చూస్తే విస్మయానికి గురి చేస్తున్నది. కొన్నేండ్లుగా ఇక్కడ పాఠశాల నిర్వహిస్తున్న పాఠశాల భవనంపై తన పేరు కూడా రాసుకోకుండా పాఠశాల నిర్వహిస్తుంటే అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారో స్పష్టం అవుతుంది.
శంషాబాద్‌ రవీంద్ర భారతి స్కూల్‌లో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారన్న విషయం తెలుసుకున్న శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కెవై ప్రణరు ఆధ్వర్యంలో పాఠశాల వద్ద ఆందోళన చేశారు. పాఠశాలలోకి వెళ్లిన విద్యార్థులు మండల విద్యాధికారికి సమాచారం అందించి పుస్తకాలు విక్రయిస్తున్న గదిని సీజ్‌ చేయించారు. కొన్ని పుస్తకాలు బయటికి తీసుకువచ్చి పాఠ శాల ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సమ యంలో పాఠశాలలో విక్రయిస్తున్న పాఠ్యపుస్తకాలను పరిశీ లిస్తే వాటిపై ఎమ్మార్పీ గాని ప్రభుత్వ నిబంధనలు, ముద్ర ణ సంస్థ, రచించిన వారి పేర్లు గాని లేవు. ఈ సందర్భంగా ప్రణరు మాట్లాడుతూ రవీంద్ర భారతి స్కూల్లో ధనార్జన కోసమే పాఠశాల నడుపుతున్నారని అన్నారు. పాఠశాల యాజమాన్యం తమ సొంత ముద్రణ చేసిన పుస్తకాలకు ఎమ్మార్పీ లేకుండా ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఈ పుస్తకాన్ని రాసిన రచయితలు, కవులు నిర్వాహకులు, జాతీయ గీతం, ప్రతిజ్ఞ లాంటివి ఏవి లేకుండా ముద్రించి వాళ్లకు తోచిన రీతిలో తల్లిదండ్రులకు అధిక ధరలకు అంటగాడుతున్నారన్నారు. పుస్తకాల రేటు ఎంత చెప్తే అంతకు కొనాలని కొన్న వాటికి బిల్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారనీ అన్నారు. నిబంధనలు పాటించకుండా స్కూల్‌ హెచ్‌ఎం విద్యార్థి నాయకులపై దౌర్జన్యానికి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల పదేండ్లుగా కొనసాగు తున్న భవనంపై ”రవీంద్ర భారతి స్కూల్‌ ”అని పేరు రాయకుండా కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ పాఠశాలకు అసలు గుర్తింపు ఉందా లేదా అనే కోణంలో విద్యాధికా రులు దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. తాను వచ్చి 15 రోజులు మాత్రమే అవుతుందని తనకేమీ తెలియదని హెచ్‌ఎం తిరుపతి బుకాయిస్తున్నారని తెలిపారు. పనిచ ేస్తున్న యాజమాన్యానికి ఏమాత్రం స్వేచ్ఛ లేకుండా ఎక్కడో ఉండి రిమోట్‌ కంట్రోల్‌తో పాఠశాలను నడపడం ఏంటనీ ప్రశ్నించారు. రవీంద్ర భారతి స్కూల్‌లో ఫీజు దోపిడీ, పుస్త కాల విక్రయం, నేమ్‌ బోర్డ్‌ లేకుండా కొనసాగడం వంటి అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలన్నా రు. అనేక ఉల్లంఘనలతో నడుస్తున్న రవీంద్ర భారతి స్కూల్‌ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి పాఠశాలను సీజ్‌ చేయాలనీ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్ర మంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జయశ్రీ, ప్రసాద్‌ చారి, కౌశిక్‌, దివ్య, తరుణ్‌, వలిఉద్దిన్‌, వేణు, ప్రకాష్‌, శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.