– పాఠశాలల్లో పారిశుధ్య సమస్య
– తెలంగాణ పౌర స్పందన వేదిక సర్వేలో వెల్లడి
– సర్వీసు పర్సన్లను నియమించాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయు ల కొరత ఉన్నది. ఇంకోవైపు వాటిలో పారిశుధ్యం సమస్య వెంటాడుతున్నది. అయితే తెలంగాణ పౌర స్పందన వేదిక (టీపీఎస్వీ) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 1,217 ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, పారిశుధ్యం పరిస్థితులపై సర్వే నిర్వహించింది. 1,217 పాఠశాలల్లో 246 ఎస్జీటీ పోస్టులు, 74 స్కూల్ అసిస్టెంట్ (గణితం), 111 స్కూల్ అసిస్టెంట్ (తెలుగు), 106 స్కూల్ అసిస్టెంట్ (హిందీ), 75 స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్), 52 స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్స్), 127 స్కూల్ అసిస్టెంట్ (బయోసైన్స్), 187 స్కూల్ అసిస్టెంట్ (సాంఘికశాస్త్రం) పోస్టులు అవసరమని తేలింది. 567 పాఠశాలల్లో పారిశుధ్యం గ్రామపంచాయతీ, మున్సిపాల్టీ, మున్సిపల్ కార్పొరేషన్లు నియమించిన సిబ్బంది అప్పుడప్పుడు వచ్చి శుభ్రం చేస్తున్నారు. 246 బడుల్లో స్థానిక సంస్థలు నియమించిన సర్వీసు పర్సన్ల ద్వారా పారిశుధ్యం పనులను నిర్వహి స్తున్నారు. 404 పాఠశాలల్లో ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు సొంత డబ్బులతో సర్వీసు పర్సన్లను నియమించుకుని పారిశుధ్యం పనులను చేయిస్తున్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించాలి : టీపీఎస్వీ
సర్వే వివరాలను టీపీఎస్వీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం రాధేశ్యాం శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. వాస్తవ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలల్లో అవసరమున్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పారిశుధ్యం పనులను స్థానిక సంస్థల ద్వారా కాదని అనుభవంలో తేలిందని తెలిపారు. కావున ప్రత్యేకంగా సర్వీసు పర్సన్లను నియమించాలని డిమాండ్ చేశారు.
సర్వే వివరాలు ఉపాధ్యాయుల కొరత
అవసరం లేదు : 653 (53.7 శాతం)
ఎస్జీటీ : 246 (20.2 శాతం)
ఎస్ఏ మ్యాథ్స్ : 74 ((6.1 శాతం)
ఎస్ఏ తెలుగు : 111 (9.1 శాతం)
ఎస్ఏ హిందీ :106 (8.7 శాతం)
ఎస్ఏ ఇంగ్లీష్ : 75 (4.3 శాతం)
ఎస్ఏ ఫిజికల్ సైన్స్ : 52 (4.3 శాతం)
ఎస్ఏ బయోసైన్స్ : 127 (10.4 శాతం)
ఎస్ఏ సోషల్ : 187 (15.4 శాతం)