– లేకపోతే ఆందోళన తప్పదు
– నిలోఫర్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తమ సేవలను క్రమబద్ధీకరించాలనీ, లేకపోతే ఆందోళన తప్పదని నిలోఫర్ ఆస్పత్రి పొరుగు సేవల ఉద్యో గులు హెచ్చరించారు. ఆదివారం నిలోఫర్ ఆస్పత్రి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రతినిధులు సుందర్, సత్యం, రాజు, ప్రవీణ్ కుమార్, జ్యోత్స్న, విజయలక్ష్మి, మౌనిక, శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు.
నిలోఫర్ ఆస్పత్రిలో 18 ఏండ్లుగా సేవలందిస్తున్నామని తెలిపారు. 2006లో విధుల్లో చేరామనీ, కోవిడ్-19 మహమ్మారి కాలంలో ప్రాణాలకు తెగించి సేవలందించినట్టు ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. రెగ్యులరైజ్ చేయని పక్షంలో దశల వారిగా పోరాటాలకు సిద్ధమవుతామని తెలిపారు.
కోవిడ్ తర్వాత తమ జీతాల్లో కోతలు పెట్టడం ప్రారంభించారనీ, రూ.27,500 జీతానికి బదులుగా రూ.22,750 మాత్రమే వేతనం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేతనంలో కోతలు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.