నవతెలంగాణ – (వేల్పూర్ ) ఆర్మూర్
మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతే గ్రామానికి 235 జతల షూ వితరణ కార్యక్రమం బుధవారం నిర్వహించినారు. గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి ఇసపెల్లి రవి కమ్మర్ పెళ్లి మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల కోసం అడగగానే షూ వితరణ చేస్తానని ఒప్పుకొని పంపించడం జరిగింది అని,. ఈ యొక్క షూ వితరణ కార్యక్రమాన్ని జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డోళ్ళ రాజేశ్వర్,మేనేజర్ యొక్క మిత్ర బృందం చేతులమీదుగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అందజేసినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, తెలిపారు ..ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రత్నయ్య, శ్రావణ శ్రీ, కవిత, పిడి మంచిర్యాల సురేష్ కుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.