బిజెపి మండల కార్యాలయంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్

– శ్యాం ప్రసాద్ ముఖర్జీని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్దాం మండల పార్టీ అధ్యక్షులు హనుమాన్లు
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని బిజెపి మండల శాఖ కార్యాలయంలో శుక్రవారం నాడు ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో శ్రీ శాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షులు బి హనుమాన్లు మాట్లాడుతూ.. శ్యాంప్రసాద్ ముఖర్జీని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్దామని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ బలిదాన్ దివస్ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు బి హన్మాండ్లు, చాట్ల హన్మాండ్లు జనరల్ సెక్రటరీ, తెప్పవార్ తుకరం, కె యాదవ్ రావు, తదితరులు పాల్గొన్నారు