సిగరెట్‌ పీకలతో సాఫ్ట్‌ టాయ్స్… రోడ్లు…

సాధారణంగా ఇంట్లో సినిమా చూస్తున్నా, థియేటర్‌ లోనై సినిమా కన్నా ముందు ఒక ప్రకటన వెలువడుతుంది. ‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’అనే ప్రకటన అందరం చూసే ఉంటాం. అయితే వీటిని ఏమాత్రం పట్టించుకొని అనేక మంది బహిరంగ ప్రదేశాల్లో కూడా ధూమపానం చేస్తూ ఉంటారు. అయితే దూమపానం చేసే వారి కన్నా, వారి పక్కన ఉండే వారికి ఇది అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా తాజా అధ్యయనాలలో సిగరెట్‌ కన్నా, సిగరెట్‌ తాగి పడేసిన పీక ఎంతో ప్రమాదకరమని వెల్లడైంది. సిగరెట్‌ ఎక్కువగా తాగడం వల్ల వాటి ప్రభావం నెమ్మదిగా ఊపిరితిత్తుల మీద పడుతుంది. ఫలితంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి అనారోగ్య సమస్యల బారిన పడతారు అన్న విషయం తెలిసినదే. అయితే తాజాగా సిగరెట్‌ తాగి పడేసిన పీకలో నికోటిన్‌ అనే పదార్థం ఉండటం వల్ల మనం తాగి పడేసినప్పుడు దానిలో ఉండే నికోటిన్‌ గాలిలో కలిసి దాని ప్రభావం గాలిలో ఒక వారం వరకు ఉంటుందని అమెరికాకు చెందిన నేషనల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాండర్డ్స్‌ అండ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తాజా పరిశోధనల్లో తెలిపారు.
నీరు కాలుష్యం కాకుండా..
ఇప్పటిదాకా 250 కోట్ల సిగరెట్‌ పీకలను ఇలా ప్రాసెస్‌ చేసిందా సంస్థ. అంటే సుమారు 125 కోట్ల లీటర్ల నీరు కాలుష్యం కాకుండా అడ్డుకుందన్నమాట!

మహిళలకు ఉపాధి
కాగితాన్ని రీసైకిల్‌ చేసి, ఫైబర్‌ను ప్రాసెస్‌ చేసి సరికొత్త రకం పత్తిని తయారు చేస్తారు. ఆ పత్తితో మదువైన బొమ్మలు, ఇతర కళాకతులను తయారు చేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా, రిటైల్‌ స్టోర్స్‌ ద్వారా వాటిని విక్రయిస్తారు. ఈ మొత్తం ప్రక్రియను నోయిడాలోని ఓ ప్లాంట్‌లో చేస్తారు. నమన్‌కు వచ్చిన ఆలోచన తనకు వ్యాపారం మారడమే కాకుండా స్థానిక మహిళలకు ఉపాధి కూడా కల్పిస్తోంది.

ఈ పరిశోధనల ప్రకారం దాదాపు 15 శాతం నికోటిన్‌ సిగరెట్‌ పీకలో నిల్వ ఉండిపోవడం వల్ల మనం సిగరెట్‌ తాగి దానిని యాష్‌ ట్రే లో కానీ లేదా బహిరంగ ప్రదేశాలలో వేసినప్పుడు అందులో వుండే నికోటిన్‌ గాలిలో కలవడం వల్ల మానసిక ఆరోగ్య స్థితిపై ప్రభావం పడుతుంది. చిన్న పిల్లలపై,ముసలి వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి. అందువల్ల సిగరెట్‌ తాగకపోవడం ఎంతో మంచిది. కానీ, దానిని పాటించేవారేందరు? అనేది వేల డాలర్ల ప్రశ్న.
కాల్చి పారేసిన సిగరెట్‌ పీకలు ఎందుకూ పనికి రావని అందరూ అంటారు. ఎందుకూ పనికి రాని వస్తువులను, సంపాదన లేని మనుషులను వాడి పారేసిన సిగరెట్‌ పీకలతో పోలుస్తుంటారు. అయితే అలాంటి సిగరెట్‌ పీకలతోనే ఓ వ్యక్తి డబ్బులు సంపాదిస్తున్నాడు. రోడ్ల మీద పడి ఉండే సిగరెట్‌ పీకలను సేకరించి వాటితో బొమ్మలను, ఎరువులను తయారు చేస్తున్నాడు. అంతేకాదు మరికొంత మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు. అతని కథ తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపించకమానదు.
సిగరెట్‌ పీకలో ఉండే దూదిలాంటి ప్లాస్టిక్‌- సెల్యులోజ్‌ అసిటేట్‌ భూమిలో కలిసిపోవడానికి కనీసం కొన్ని ఎండ్లు పడుతుందంటాడు నమన్‌ గుప్తా. అంతేకాదు, ప్రతి పీకా అరలీటరు భూగర్భ జలాన్ని కలుషితం చేస్తుందని అంటున్నాడు. అందుకే ఈ సిగరెట్‌ పీకల్ని రీసైక్లింగ్‌ చేయడానికి సరికొత్త పద్ధతిని కనిపెట్టాడు నమన్‌ గుప్తా. నొయిడాకు చెందిన గ్రాడ్యుయేట్‌ నామన్‌ గుప్తా, విశాల్‌ కనెత్‌ అనే ఇంజినీర్‌ కలిసి కొన్నాళ్ల కిందట ‘కోడ్‌ ఎఫర్ట్‌’ పేరుతో 2018లో స్టార్టప్‌ కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ ద్వారా సిగరెట్‌ పీకలను శుభ్రపర్చి బొమ్మలు, కుషన్లు తయారు చేస్తున్నారు. ఇవి భూమిలో కలిసిపోవడానికి పదేండ్లుకుపైగా సమయం పడుతుంది. దీన్ని బట్టి ఆలోచించండి.. రోజుకు కోట్ల సిగరెట్‌ పీకలు భూమిలో కలిసిపోకుండా.. ఎంత భారీ భూకాలుష్యానికి కారణమవుతున్నాయో! ఈ ఆలోచనే ‘కోడ్‌ ఎఫర్ట్‌’ స్టార్టప్‌ కంపెనీ స్థాపనకు శ్రీకారం చుట్టింది.
వీబిన్స్‌తో సిగరెట్‌ పీకల సేకరణ

సిగరెట్ల వినియోగం, చెత్తబుట్టలకు చేరుతున్న సిగరెట్‌ పీకలు వంటి అంశాలపై నామన్‌.. విశాల్‌ బాగా అధ్యయనం చేశారు. అనంతరం ‘కోడ్‌’ కంపెనీ స్థాపించి.. యంత్రాలను సమకూర్చుకున్నారు. అయితే, సిగరెట్‌ పీకలను ఎలా సేకరించాలనేదే వీరికి పెద్ద సవాల్‌ గా మారింది. అందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న స్క్రాప్‌ డీలర్‌లను సంప్రదించాడు. దీనికోసం కోడ్‌ సంస్థ వీధి వ్యాపారులు, చెత్త సేకరించేవాళ్లకు ‘వీబిన్స్‌’ పేరుతో డబ్బాలు పంపిణీ చేసింది. రోడ్ల పక్క దుకాణాలు, టీ స్టాల్స్‌, కార్యాలయాల్లోని చెత్తబుట్టల వద్ద వీటిని పెట్టి కేవలం సిగరెట్‌ పీకలను సేకరించాలని సూచించింది. ఇలా సేకరించిన సిగరెట్‌ పీకలను ఈ సంస్థే కిలో రూ.250 చొప్పున కొనుగోలు చేస్తుంది.
ఆ సంస్థ ద్వారా దేశంలోని 250కి పైగా జిల్లాల నుంచి సుమారు రెండువేల మంది కార్మికుల ద్వారా రోజూ వెయ్యి కిలోల సిగరెట్‌ పీకల్ని సేకరిస్తున్నారు. వాటి నుంచి పొగాకు, సన్నటి కాగితం, దూదిలాంటి ప్లాస్టిక్‌(సెల్యూలోజ్‌ అసిటేట్‌)ను వేరు చేస్తున్నారు. పొగాకును సూక్ష్మజీవుల సాయంతో ఎరువుగా మారుస్తున్నారు. సన్నటి పేపర్‌ను ప్రత్యేక రసాయనాలతో పల్ప్‌గా మార్చి… 250 జీఎస్‌ఎం మందంలో పేపర్‌లని తయారు చేస్తున్నారు. వాటితో కవర్లూ, లెటర్‌హెడ్లూ వంటివి రూపొందిస్తున్నారు. చివరగా దూదిలాంటి ప్లాస్టిక్‌- సెల్యూలోజ్‌ అసిటేట్‌ని బొమ్మలు, తలగడలు, ఇతర అలంకరణ వస్తువుల్లో నింపే ప్లాస్టిక్‌ స్టఫింగ్‌గా వాడుతున్నారు. రానున్న ఐదేళ్లలో దేశవ్యాప్తంగా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు చెబుతున్నారు. నిజంగానే ఇది మంచి ఆలోచన కదా!
బొమ్మలు.. కుషన్లు..

ఇలా సేకరించిన సిగరెట్‌ పీకల్ని న్యూఢిల్లీ శివారులో ఉన్న వీరి పరిశ్రమలో శుభ్రపరిచిన తర్వాత ఆ పీకల్లో ఉండే దూదిలాంటి ఫైబర్‌ను బయటకు తీసి బ్లీచ్‌ చేస్తున్నారు. ఈ ఫైబర్‌తో అందమైన బొమ్మలను తయారు చేస్తున్నారు. అలాగే పిల్లోస్‌ తయారీలో కూడా ఈ ఫైబర్‌ను వాడుతున్నారు. తొలినాళ్లలో 10 గ్రాముల సిగరెట్‌ బట్‌ ఫైబర్‌ సేకరించేవారు. ఇప్పుడది వేయి కిలోలకు చేరింది. ఇందుకోసం నిత్యం లక్షలాది సిగరెట్‌ పీకలను సేకరించి రీసైక్లింగ్‌ చేస్తున్నారు. వీరు తయారుచేసిన సాఫ్ట్‌ టాయ్సు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అమ్మకానికి ఉంచారు. చిన్నారులు వీటిని అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ సంస్థలో పనిచేయడం వల్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా జరుగుతున్నదని అక్కడ పనిచేసే ఉద్యోగుల అభిప్రాయం. ఢిల్లీకి చెందిన నమన్‌ గుప్తా ఆలోచనలకు ప్రతిరూపంగా ఈ సిగరెట్‌ బట్‌ సాఫ్ట్‌ టార్సు, పిల్లోస్‌ తయారవుతున్నాయి.

సిగరెట్‌ పీకలతో రోడ్లు

దునియా మే కోయీ చీజ్‌ నహీ బేఖార్‌ థీ అంటారు. ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువంటూ లేదు. ఆఖరికి కాల్చి పారేసిన సిగరెట్‌ పీక కూడా. సిగరెట్‌ బట్స్‌ తో పర్యావరణానికి ముప్పుందని అనేక హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో.. వాటితో ఉపయోగం కూడా వుందన్న వార్త నిజంగా సంతోషమే కదా. పారేసిన సిగరెట్‌ పీకలతో ఎంచక్కా రోడ్ల గుంతల్ని పూడ్చేయవచ్చట. ప్రతీ ఏటా 6 ట్రిలియన్ల సిగరెట్‌ పీకలు భూమ్మీద పోగవుతున్నాయి. అంటే 1.2 మిలియన్‌ టన్నుల పీకలు వేస్టేజీ కింద పడుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే 2025కల్లా ఆ బరువు యాభై శాతం పెరుగుతుందని అంచనా. పెరుగుతున్న జనాభా, మారుతున్న అలవాట్లు పర్యావరణాన్ని మరింత కాలుష్యం చేస్తాయన్నది కఠోర వాస్తవం. పదినుంచి పదిహేను సంవత్సరాల దాకా డీ కంపోజ్‌ కాని సిగరెట్‌ పీకల్ని తారులో కలిపి రోడ్డు వేస్తే ఆ రహదారి చెక్కుచెదరకుండా వుంటుందట. రోడ్డు ఎంతటి ట్రాఫిక్‌ నైనా తట్టుకుంటుందట. థర్మల్‌ కండక్టివిటీని కూడా తగ్గించే శక్తి సిగరెట్‌ పీకలకు ఉందని మెల్‌ బోర్న్‌ యూనివర్శిటీ పరిశోధనలో తేలింది. మెల్‌ బోర్న్‌ ఆర్‌ఎంఐటీ యూనివర్శిటీలో లెక్చరర్‌ గా పనిచేసే అబ్బాస్‌ మోహజెరాని ఈ విషయంపై ఎడతెగని పరిశోధన చేశారు. సిగరెట్‌ పీకల నుంచి పర్యావరణాన్ని కాపాడేందుకు అబ్బాస్‌ ఎన్నో సస్టెయినబుల్‌ ప్రాక్టికల్‌ మెథడ్స్‌ ఉపయోగించారు. వందలాది టాక్సిక్‌ కెమికల్స్‌ తో తయారుకాబడిన సిగరెట్‌ పీకల్ని వేడిచేసిన తారులో మిక్స్‌ చేస్తే రోడ్డు వేస్తే దారినంతా ఇటుకలతో కప్పేసినంత గట్టిగా వుంటాయని తేల్చి చెప్పారు. ఇకనైనా పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన సిగరెట్‌ పీకలతో రోడ్లు వేయడం వలన భవిష్యత్‌ లో పర్యావరణానికి ముప్పు కొంత తగ్గుతుంది. ప్రభుత్వాలు ఇలాంటి వాటిపై దష్టి పెడితే అటు పర్యావరణానికి మేలు చేస్తుంది. అదే విధంగా గుంతలు లేని అందమైన రోడ్లు నిర్మాణం అవుతాయి.
– మోహన్‌

Spread the love
Latest updates news (2024-07-07 07:06):

my blood sugar is 200 what should LHK i do | how can i lower my blood sugar while on EWf prednisone | blood sugar levels exercise effects zBO | name of needle to take DIz blood sugar | headaches blood sugar MRL levels | normal fasting blood sugar dawn phenomenon qHa | do goldfish crackers impact blood oBi sugar quickly | how long before konjac affects blood sugar PBR | multivitamin healthy Hvj blood sugar balance and metabolism | does lower Qpk blood sugar speed up weight loss | 95T 111 blood sugar after 16 hour fast | glyburide low blood Jkf sugar pregnancy | what foods bring down your blood sugar 5mn | does pravastatin cause high dQ4 blood sugar | alzheimer and mc5 high blood sugar | 116 blood sugar pregnancy Jlk | Xni ideal snacks for blood sugar low | tsh and bgb blood sugar tested | glutamine lowers PxQ blood sugar | banana oje help blood sugar | will macrobod raise Ogq blood sugar in diabetics | normal fasting blood sugar 5Id level in adults | free n3h blood sugar check up | does 16G gluten sensitivity affect blood sugar levels | does pulmicort raise 5WE blood sugar | does blood sugar go up 7sw when you have a cold | njo fruits that affect blood sugar | diabetes safe level vqi blood sugar | is Fzm blood sugar level 6 ok | why won t my blood sugar go down bHT | blood sugar ranges for type 2 diabetes Oao | can kFr an aneurysm raise your blood sugar | whats the oi0 blood sugar range | can high blood sugar cause a headache BTV | blood sugar level for 2X5 70 year old male | animal 6h2 blood sugar levels | what hormone increases Qh1 blood sugar levels | noraml OYi blood sugar level | does y7M high blood sugar make it hard to lose fat | fasting Sev blood sugar procedure | type TBp 1 diabetes high blood sugar levels | VuL emergency shot for low blood sugar | recording blood sugar levels XDr | how to check 1XL blood sugar without taking blood | normal blood av6 sugar levels for 42 year old woman | high 8LD blood sugar levels showing alcohol | blood sugar of 367 after a meal sI7 | Ko4 buspar effects on blood sugar | children LbM fasting blood sugar levels | can smoking weed cause blood sugar FvO to drop