
ఫాదర్ కొలంబో ఈ నగరా ప్రాంతానికి చేసిన అభివృద్ధి పనులకు ప్రజలు ఆయనను ఎన్నటికీ మర్చిపోలేని చిరస్మరణీయుడు ఫాదర్ కొలంబో గారని ఓరుగల్లు పీఠాధిపతులు మహా ఘనత వహించిన ఉడుముల బాల అన్నారు. మండలంలోని కరుణాపురం గ్రామంలో ఘనంగా ఫాదర్ కొలంబో 14వ వర్ధంతి వేడుకలను గురువారం విచారణ గురువులు ఫాదర్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓరుగల్లు పీఠాధిపతులు మహా ఘనత వహించిన డాక్టర్ ఉడుమల బాల గారు పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మాట్లాడారు. ఫాదర్ కొలంబో గారు ఓరుగల్లు మేత్రాసనానికి మరియు కరుణాపురం విచారణకు ఆయన చేసిన విశిష్ట సేవలు గుర్తు చేశారు. ఈ ప్రాంతంలోని అనేకమందికి ఉన్నత జీవితాన్ని అందించిన గొప్ప వ్యక్తిని అంతేకాకుండా ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలకు నిలియంగా పెద్దపెద్ద కట్టడాలను నిర్మించి తన ఉదార స్వభావాన్ని చాటుకున్న మహోన్నత వ్యక్తిని కొలంబో గారని అన్నారు.ఆయన చేసిన సేవకు నేడు మన ప్రత్యక్షంగా వృద్ధులకు వితంతువులకు చెవిటి మూగవారికి అనాధలకు ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చేసిన సేవకు ఆయన చిరస్మరణీయులుగా చిరంజీవిలుగా నిలిచారని వారికి ఆ దేవాది దేవుడు అతని ఆత్మకు నిత్య విశ్రాంతి దయ చేయునట్లుగా ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో కరుణాపురం గ్రామ సర్పంచ్ కలకోటి అనిల్ కుమార్,మాజీ ఎంపిటిసి సిక వసంత,గ్రామ పెద్దలు రాజారపు దేవయ్య ,పాశం సంజీవ,రాజరపు విమల,యువత అధ్యక్షుడు గాదే తరుణ్,గుర్రపు ప్రవీణ్,నరేష్, భార్గవ్, పవన్ ,వంశీ,నిర్మల్ మరియు క్రైస్తవ విశ్వాసులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.