మనోభావాలు దెబ్బతింటే సారీ

–  తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముషీరాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జి ఓపెనింగ్‌ సందర్భంగా జరిగిన సంఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించారు. ఆ రోజు తన కాలును ఒక వ్యక్తి తొక్కడంతో గాయమై రక్తమొచ్చిందనీ, అందుకే ఆ వ్యక్తి నెట్టివేశానని తెలిపారు. ఈ ఘటనలో కాలు తొక్కిన గిరిజనునికి వెంటనే ఫోన్‌ చేసి సారీ చెప్పానని చెప్పారు. ఈ ఘటనలో వారి మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరారు.