అరుణాచల గిరి ప్రదర్శనకు ప్రత్యేక బస్సు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గురుపౌర్ణమి సందర్భంగా జులై 3వ తేదీ హైదరాబాద్‌ ఎమ్‌జీబీఎస్‌ నుంచి తమిళనాడులోని అరుణాచలం వరకు టీఎస్‌ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ ప్రత్యేక బస్సును నడుపుతున్నట్టు ఆ సంస్థ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. జులై 2న ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌లోని ఎమ్‌జీబీఎస్‌ నుంచి బయలు దేరి, ఆంధ్రప్రదేశ్‌ కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనానంతరం అదే రోజు రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది. గిరి ప్రదర్శన పూర్తయిన తర్వాత జులై 3 మధ్యాహ్నం 3 గంటలకు వెల్లూరులోని గోల్డెన్‌ టెంపుల్‌కు వెళ్తుంది. అక్కడ దర్శనానంతరం బయల్దేరి, మరుసటి రోజు (జులై 4) ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. అరుణాచల గిరి ప్రదర్శనను టూర్‌ ప్యాకేజీ రూపంలో అందిస్తున్నట్టు తెలిపారు. దీనిలో ఒక్కొక్కరికి రూ.2,600 టిక్కెట్‌ ధరగా నిర్ణయించారు. అరుణాచల గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ షషష.్‌రత్‌ీషశీఅశ్రీఱఅవ.ఱఅ లో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. ఎంబీజీఎస్‌, జేబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్లతో పాటు టీఎస్‌ఆర్టీసీ రిజర్వేషన్‌ కౌంటర్లలోనూ బుక్‌ చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం 99592 26257, 99592 24911 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.