క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే పోటీలు ప్రతి ఏటా క్రీడా టోర్నమెంట్‌లు

– క్రీడలు, విద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యత
– నేడు తాండూరులో 6 వేల మంది యువతతో భారీ బైక్‌ ర్యాలీ
– యువత బైక్‌ ర్యాలీని విజయవంతం చేయాలి
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని యువతను క్రీడల్లో ప్రో త్సహించేందుకు పీఎంఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తాండూర్‌ నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ క్రికెట్‌ టోర్న మెంట్‌ నిర్వహించారని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సం స్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి అన్నారు. మంగళ వారం తాండూరు పట్టణ కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రతి మండలంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ లో గెలుపొందిన జట్లకు నేడు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పా టుచేసిన సమావేశంలో బహుమతులను ప్రదానం చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాటు పట్టణ ప్రాంతాల్లో యువతను ప్రోత్సహించేందుకు టోర్నమెంట్‌ ఏర్పాటు చేశామ న్నారు. పట్టణ కేంద్రంలో నేడు 6 వేల మంది యువ తతో భారీ బైక్‌ ర్యాలీ ఏర్పాటు చేశారన్నారు. బైక్‌ ర్యా లీ చౌరస్తా నుండి ప్రారంభమై ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ముగుస్తుందన్నారు. పీఎంఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వ ర్యంలో నిర్వహించిన టోర్నమెంటులో గెలు పొందిన వారికి బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. పీఎం ఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్న మెంట్లో 225 జట్లు, 3వేల మంది క్రీడాకారులు పాల్గొన్నా రన్నారు. నియోజవర్గ స్థాయిలో జరిగిన పోటీల్లో పెద్దెము ల్‌ జట్టు మొదటి స్థానం బషీరాబాద్‌ జట్టు రెండో స్థానం నిలిచా యన్నారు. వీరికి మొదటి బహుమతి రూ.2 లక్షలు రెండో బహుమతి లక్ష రూపాయలు అందజేస్తామ న్నారు. పట్టణ మండల స్థాయిలో మొదటి బహుమతి రూ.50 వేలు రెం డవ బహుమతి రూ.25వేల నగదు బహుమతులను ప్రదా నం చేస్తామన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రాలను అందజేస్తామన్నారు. క్రీడలతో పాటు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తామన్నారు. రానున్న రోజుల్లో ఉమ్మడి రానుంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. విద్య, వైద్యం ఉపాధి రంగాల్లో యువతకు చేయూతనందిస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తం రావు, మాజీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్‌ రావు ఫ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వడ్డే శ్రీనివాస్‌, బషీరాబాద్‌ జడ్పీటీసీ శ్రీని వాస్‌ రెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ అబ్దుల్‌ రజాక్‌, ప్రవీణ్‌ గౌ డ్‌, రాము,మాజీ కౌన్సిలర్‌ జుబేర్‌ లాల, యువ నాయకులు శ్రీకాంత్‌ రెడ్డి, రాకేష్‌ అశోక్‌, అంజిరెడ్డి పాల్గొన్నారు