నవతెలంగాణ పెద్దవంగర: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటానని ఆ పార్టీ మండల సీనియర్ నాయకులు తోటకూర శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మండలంలోని అవుతాపురం గ్రామానికి చెందిన వేముల సోమక్క(80) ఇటీవల మృతి చెందారు. ఆదివారం దశదినకర్మకు హాజరైన ఆయన బాధిత కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యం అందజేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అద్యక్షుడు కాసోజు సోమచారి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గద్దల స్వామి, సుధాకర్, బొమ్మెరబోయిన రవి, ప్రభాకర్, సోమయ్య, రాజు, ఓరుగంటి శివ, హరీష్, వెంకటేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.