నవతెలంగాణ-హైదరాబాద్ : తాజాగా బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61, 640 గా నమోదు కాగా… అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56, 500 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 78, 000 గా నమోదు అయింది.