– కాంగ్రెస్ జాతీయ కిసాన్ చెరువు ఉపాధ్యక్షులు ముదిరెడ్డి కోదండరెడ్డి
నవతెలంగాణ-యాచారం
హైకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఫార్మాసిటీని పూర్తిస్థాయిలో రద్దు చేయాలని కాంగ్రెస్ జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళ వారం ఫార్మా బాధిత రైతులు యాచారంలో కోదండ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల పక్షాన హైకోర్టులో పోరాడినందుకు ఆయనకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ ఫార్మాసిటీకి వ్యతిరేకంగా రైతులంతా ఐక్యంగా ఉండి పోరాడాలని సూచించారు. కోర్టు తీర్పు రైతుల పక్షాన రావడంతో తనకు ఆనందంగా ఉందన్నారు. ఫార్మా కోసం ప్రభుత్వం జారీ చేసినా నోటిఫికేషన్‌ను కోర్టు పూర్తిగా రద్దు చేసిందని తెలిపారు. విషవాయువులు వెదజల్లే ఫార్మసిటీని రద్దు చేయాలని కొన్నిసార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు వెల్ల డించారు. ఇప్పటికైనా ఫార్మా బాధిత రైతులంతా ఐక్యతతో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని తెలి పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి, తాడిపర్తి సర్పంచ్ రమేష్, రైతులు కానమోని గణేష్, శ్రీకాంత్, నారా యణ, శివ, శ్రీధర్, కమలాకర్‌రెడ్డి పాల్గొన్నారు.