వాటికి దూరంగా ఉండండి

– ప్రయివేటు సంస్థల నుంచి అవార్డులు, గుర్తింపును స్వీకరించొద్దు
– ముందస్తు అనుమతి పొందితే ఓకే
– సివిల్‌ సర్వెంట్లకు కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ : ప్రయివేటు సంస్థల నుంచి అవార్డులు, గుర్తింపులు స్వీకరించటాన్ని నిషేధిస్తూ భారత్‌లోని సివిల్‌ సర్వెంట్లకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ వంటి అఖిల భారత సర్వీ సులు (ఏఐఎస్‌)కు చెందిన సివిల్‌ సర్వెంట్లు ప్రయివేటు సంస్థలు, ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి అవార్డులను, గుర్తింపు ను స్వీకరించే విషయంలో దూరంగా ఉండాలని పేర్కొన్నది. ఈ సూచనలను పాటించాల్సిందిగా కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్స్‌ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల చీఫ్‌ సెక్రెటరీలకు, వివిధ ప్రభుత్వ విభాగాల సెక్రెటరీలకు, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు పంపింది. కేంద్రం ఈ ఉత్తర్వును ఈనెల 22న జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్గదర ్శకాలను పట్టించుకోకుండా ఏఐఎస్‌ అధికారులు ప్రయివేటు సంస్థల నుంచి అవార్డులు లేదా గుర్తింపులు స్వీకరించడాన్ని గమనించినట్టు మంత్రిత్వ శాఖ కార్యాలయ మెమోరాండంలో పేర్కొన్నది. ప్రయివేటు సంస్థల అవార్డులు, గుర్తింపులను ప్రోత్సహించకూడదని వివరించింది. ప్రయివేటు సంస్థ నుంచి అవార్డును స్వీకరించటం సరికాదని మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. అయితే, అ వార్డు ప్రదానం చేసే సంస్థ ఆధారాలను ధృవీకరించిన తర్వాత, సంబంధిత శాఖ లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాత ఏఐఎస్‌ అధికారులు అవార్డులను స్వీకరించడానికి ప్రభుత్వం అనుమతించింది.