– కలెక్టర్ ప్రియాంక అలా
– ప్రజావాణిలో అధికారులకు ఆదేశం
నవతెలంగాణ-పాల్వంచ
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశపు హాలులో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిద ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు నిషిత పరిశీలన చేయాలని, ప్రతి దరఖాస్తు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కరించాలని ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు కొన్ని ఎలా ఉన్నాయి పాల్వంచ మండలం, పాత పాల్వంచకు చెందిన పెరుమాళ్ళపల్లి మరియమ్మ భర్త జాన్ మోజేష్ తమకు వివాహం జరిగి 35 ఏండ్లు తమకి ఒక సంతానమని, కూలి పనులు చేసుకుంటూ ఇన్ని సంవత్సరములు కిరాయి ఇండ్లలో జీవనం కొనసాగిస్తున్నామని తమ ఆర్థిక పరిస్థితి కిరాయి కట్టుకోలేని స్థితిలో ఉన్నందువలన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయవలసిందిగా చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం డీఆర్‌వోకు ఎండార్స్ చేశారు. అశ్వారావుపేట మండలం, పాపిడి గూడెంకు చెందిన నాలి మహా లక్ష్మయ్య సర్వే నెం:909/1లో 3 ఎకరాల భూమి కలదని, సదరు భూమి తమ ఆధీనంలోనే ఉన్నదని, కానీ ధరణి పోర్టల్ నందు అదే గ్రామానికి చెందిన ఆళ్ల నాగేశ్వరరావు గంగాజలం, ఆళ్ల లక్ష్మీనారాయణల పేరుమీద అయి ఉన్నాయని వారి పేర్లను ఆన్లైన్ నుంచి రద్దు పరచి అసలు హక్కుదారులైన తమ పేరును ధరణి పోర్టల్ యందు నమోదు చేయవలసిందిగా చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం ఆర్‌ఏఓ కొత్తగూడంకు ఎండార్స్ చేసినారు. కొత్తగూడెం మండలం, రామవరంకు చెందిన మహమూదా బేగం తన భర్త చనిపోవడం వలన కూలి పనులకు వెళ్తూ పిల్లలను పోషించుకుంటున్నానని కుటుంబ పోషణ భారమైనదని, ముస్లిం మతానికి చెందిన వారమని తనకి ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సహాయం మంజూరు చేయవలసిందిగా దరఖాస్తు చేయగా పరిశీలించిన కలెక్టర్ తగు చర్య నిమిత్తం ఎండార్స్ చేశారు. ఇల్లందు మండలం నాయకులగూడెంకు చెందిన ఆదివాసి గిరిజనులు తాము 2010 సంవత్సరము నుండి పోడు నరుక్కొని, ఈ పోడు భూమిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని తమ భూమిని దేవీలాల్ అనే భూస్వామి అధికార బలంతో దొంగ పట్టాలు చేయించుకుని ఈ భూమిని అనుభవించుటకు ప్రయత్నిస్తున్నాడని తమకు న్యాయం చేయాలని దరఖాస్తు చేయగా పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం కొత్తగూడెం ఆర్డీవోకు ఎండార్స్ చేశారు. తదితర మండలాల నుంచి వచ్చిన ధరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్ రాజు, డిఆర్‌ఓ రవీంద్రనాథ్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.