ప్రతి ఓటర్‌కు ఓటరు స్లిప్పు అందేలా కట్టుదిట్టమైన కార్యాచరణ

నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్‌
ప్రతి ఓటర్‌ కు ఓటర్‌ స్లిప్పు అందేలా కట్టుది ట్టమైన కార్యాచరణను జిల్లాలో అమలు చేయాలని రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ అన్నారు. మంగళవారం హైదరాబాదు నుండి రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహణ, ఓటర్‌ స్లీప్పుల పంపిణీపై జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ సిహెచ్‌ శివలింగయ్య, సహాయ జిల్లా ఎన్నికల అధికారి సుహాసిని, సంబంధిత సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పరాజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహణకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని, అవసరమైన మేర యంత్రాంగం సిద్ధం చేసుకోవాలని, స్థానికంగా అందుబాటులో ఉండే కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న యువతను వెబ్‌ కాస్టింగ్‌ కోసం వినియోగి ంచుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఓటర్‌ స్లిప్పులు అందలేదని గతంలో అనేక ఫిర్యాదులు ఉన్నాయని, వీటి నివారణ కోసం ఎన్నికల కమిషన్‌ ముందస్తుగా ఓటర్‌ స్లిప్పుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించిందని, పోలింగ్‌ కేంద్రాల వారిగా ఓటర్‌ స్లిప్పుల ముద్రణ చేసి వాటి పంపిణీ పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసమావేశంలో డిఆర్డిఓ మొగులప్ప, సిపిఓ ఇస్మాయిల్‌, దుర్గారావు, ఏఓ రవీందర్‌, ఎన్నికల తాసిల్దార్‌ శ్రీనివాస్‌, విక్రం, సంబందించిన అధికారులు పాల్గొన్నారు.
సి-విజిల్‌ యాప్‌ను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి: కలెక్టర్‌
జిల్లాలోని మూడు నియోజకవర్గాలలోని రాజకీయ పార్టీల ప్రతినిధులు సి-విజిల్‌ యాప్‌ను వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సిహెచ్‌ శివలింగయ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని రాజకీయ పార్టీల ప్రతినిధుఏలు, జిల్లా ఎన్నికల వ్యయ, సాధారణ పరిశీలకులు కె.రాజమణి, రవిష్‌ గుప్తా, గున్నత్‌ ఝూలతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల నిర్వహణకు తీసుకోవల్సిన చర్యలు, జాగ్రత్తలు విధులు పక్కాగా జిల్లా ఎన్నికల అధికారి అమలు చేస్తున్నారని, అందరు సి-విజిల్‌ యాప్‌ను వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నుండి ఉడుత రవి యాదవ్‌, బిజెపి నుండి విజరు భాస్కర్‌, బిఆర్‌ఎస్‌ నుండి రావెల రవి, టిడిపి నుండి శ్రీధర్‌, సిపిఎం నుండి ప్రకాశ్‌, కలెక్టరేట్‌ ఎఒ రవీందర్‌ తదతరులు పాల్గొన్నారు.