ఇండ్లకోసం పోరాటాలు ఉధృతం

– మహబూబాబాద్‌లో ప్రభుత్వ దమనకాండను ఖండిస్తున్నాం : వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు జీ నాగయ్య
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో ఇండ్లు, ఇండ్ల స్థలా లు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలనీ, నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీ నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల సాధనకోసం తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక అధ్వర్యంలో జూన్‌ 18 నుంచి 27వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బస్సుయాత్ర కర పత్రాల ను హైదరాబాద్‌లోని ఎమ్‌బీ భవన్‌ ఆవిష్కరించారు. మహబూబాబాద్‌ లో పేదల గుడిసెలు కూల్చివేసి, 8 గంట లకుపైగా ప్రభుత్వ శాఖల అధికారులు దమనకాండ జరపడాన్ని తీవ్రంగా ఖండిం చారు. రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు అందరికీ ఉందనీ, దానిలో సొంత ఇల్లు కూడా భాగ మేనని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడం లో తీవ్రంగా వైఫల్యం చెందాయన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో 61 కేంద్రాల్లో 48 వేల మంది పేదలు ఇండ్లు వేసుకొని నివా సముంటున్నారనీ, వారందరినీ అర్హులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. బస్సు యాత్రను జయ ప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో డీజీ నర్సింహ్మ రావు (పట్నం రాష్ట్ర కన్వీనర్‌), ఆర్‌.వెంక టాములు (వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి),టి.స్కైలాబ్‌ బాబు (కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి), ఆర్‌.అరుణజ్యోతి (ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు), ఆర్‌.శ్రీరాం నాయక్‌ (గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి), కోట రమేష్‌, ఆనగంటి వెంకటేష్‌(డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు), జి.నరేష్‌ (వృత్తి సంఘాల రాష్ట్ర నాయకులు) పాల్గొన్నారు.