ఇంటర్‌ పరీక్షలో తప్పినందుకు విద్యార్థి ఆత్మహత్య

నవతెలంగాణ-గణపురం
ఇంటర్‌ పరీక్షలో ఫెయిల్‌ అయ్యానని మనస్తాపానికి గురైన విద్యార్థి సోమవారం ఉదయం ఉరి వేసుకొని ఆత్యహత్య చేసుకున్న సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బస్వరాజ్‌పల్లి గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల్లోకెళ్తే… బస్వరాజ్‌పల్లికి చెందిన అంబటి రాకేశ్‌ (19) హన్మకొండలో ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో ఫెయిల్‌ అయ్యానని మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లిదండ్రులు ఉదయం ఉపాధి పనులకు వెళ్లి వచ్చేసరికి ఉరి వేసుకొని చనిపోయాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఎస్‌ఐ అభినవ్‌ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భూపాలపల్లి ఆస్పత్రికి తరలించారు.