ఆరవ రోజు సమ్మే విజయవంతం..

– పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించేంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తాం..
నవతెలంగాణ -డిచ్ పల్లి
ఆరవ రోజు సమ్మేలో భాగంగా  డిచ్ పల్లి తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తాహసిల్దార్ శ్రీనివాస్ రావు కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మురళి, గంగాధర్, ఇందల్ వాయి సిఐటియూ అధ్యక్షులు మ్యాదరి గంగారాం లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీలలో 50వేల మంది గ్రామపంచాయతీ సిబ్బంది పనిచేస్తున్నారని వీరందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని, జీవో నెంబరు 60 ప్రకారం వేతనాలను పెంచాలని, ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వేతనాలు ఇవ్వాలని,మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, కారోబార్, బిల్లు కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా  నియమించాలని, ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబానికి 10 లక్షలు నష్ట పరిహారం అందించాలని పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని పంచాయితీ కార్మికులకు దళిత బంధు, డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూన్నమన్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోవు రోజుల్లో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కారోబార్ సంగం నాయకులు రవి, పోశెట్టి, ప్రసాద్, కార్మికులు భాస్కర్ ముత్తన్న, గంగాధర్, భూమయ్య,  రాజేందర్, అశోక్, రవి, రమేష్, దుర్గా, సుజాత, గంగారాం, మల్లయ్యతో పాటు గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.