ఇన్చార్జి తహశీల్దార్ గా సుచిత్ర

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట ఇన్చార్జి తహశీల్దార్ గా సుచిత్ర ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అల బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె ఉప తహశీల్ధార్  గా పని చేస్తున్నారు.కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం సుచిత్ర ఇన్చార్జి భాద్యతలను స్వీకరించారు.ఇప్పటి వరకు పని చేసిన తహశీల్దార్ లూధర్ విల్సన్ ఎన్నికల ప్రక్రియలో బాగంగా ఖమ్మం జిల్లా రఘునాథ్ పాలెం బదిలీ అయ్యారు. అప్పటి నుండి తహశీల్దార్ పోస్ట్ ఖాళీగా ఉంది. దీనితో దృవీకరణ పత్రాలు జారీలో కొంత ఆలస్యం కావటంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాత్కాలికంగా సుచిత్ర కు ఇన్చార్జి భాద్యతలు అప్పగించారు.