ఫొటో గ్రాఫర్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులుగా సుధాకర్‌ రెడ్డి ఎన్నిక

నవతెలంగాణ-పినపాక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫోటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులుగా మండలానికి చెందిన కీసర సుధాకర్‌ రెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం భద్రాచలంలోని రాఘవ నిలయంలో జరిగిన జిల్లా ఎన్నికలలో కీసర సుధాకర్‌ రెడ్డి, పాల్వంచ మండలానికి చెందిన శ్రీనాధరాజు వెంకటపతిరాజు పోటిపడగా ఈ ఎన్నికలలో మొత్తం జిల్లాలోని 17 మండలాలకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారిలు మొత్తం 51మందికి ఓటింగ్‌లో పాల్గొన్నారు. మొత్తం 50 ఓట్లు పోలవగా 33 ఓట్లు సుధాకర్‌ రెడ్డికి రాగా ప్రత్యర్థి వెంకటపతిరాజుకి 17 ఓట్లు రావడంతో జిల్లా అధ్యక్షులుగా 16 ఓట్ల మెజారిటీతో కీసర సుధాకర్‌ రెడ్డి గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫోటో గ్రాఫర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్‌, గౌరవ అధ్యక్షులు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షులు లింగమూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు, వేముల నర్సింహారావు, షరీఫ్‌, గుణగంటి సారయ్య, ఆర్కే బాబారు, వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దయాకర్‌, ఉపాధ్యక్షులు సర్వేస్‌, శ్యాం, సత్యం, మహబూబాబాద్‌ అద్యక్షులు నీలం రమేష్‌, మాజీ అధ్యక్షులు మారుతీ ప్రకాష్‌, 17 మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, తదితరులు పాల్గొన్నారు.