వేసవి సెలవులు మరోవారం పొడిగించాలి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల పాఠశాలలకు వేసవి సెలవులు మరో వారం రోజులు పొడిగించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు జాడి రాజన్న,ప్రధాన కార్యదర్శి మేడి చరణ్‌దాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎండ తీవ్రతకు పిల్లలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు., తీవ్ర వడగాల్పులకు బయటకు వెళ్లే పరిస్థితి లేదనీ, ప్రభుత్వం సెలవులు పొడిగింపునకు సమాలోచనలు చేయాలని డిమాండ్‌ చేశారు.