నకిలీ నెంబర్ ప్లేట్లతో ఏపీ నుండి మహారాష్ట్ర కు గంజాయి సరఫరా…

Marijuana
Marijuana

– 200కేజీల గంజాయి పట్టివేత…
నవతెలంగాణ-హాయత్ నగర్
గంజాయి స్మగ్లింగ్ లు సైతం రోజు రోజుకు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కార్లలో ఉన్న కింద సీట్ల కింద పెట్టి, నకిలీ నెంబర్ ప్లేట్ లు మార్చి ఏపీ నుండి మహారాష్ట్రకు గంజాయిని సరఫరా చేస్తున్న వారిని యల్బి నగర్ ఎస్ఓటీ పోలీసులు, చోటుప్పల్ పోలీసులు సంయుక్తంగా కలిసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని తమ రాష్ట్రంలోకి అనుమతించేది లేదని, అట్టి వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహన్ హెచ్చరించారు.మంగళవారం యల్ బి నగర్ లో ఉన్న సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్రాష్ట్ర గంజాయి వ్యాపారులు సిలేరు, ఆంధ్రప్రదేశ్ (సీలేరు నుండి) మహారాష్ట్రకు గంజాయిని రవాణా చేయడం కోసం నిర్వహించారు.వివేక్ మోహన్ రావు. (ట్రాన్స్పోర్టర్) గణేష్ మారుతీరావు(ట్రాన్స్పోర్టర్).సచిన్ సురేష్ గాడే.సంతోష్ బహర్ బురాడి(ట్రాన్స్పోర్టర్). సామ్రాట్ సురేంద్ర మనే(ట్రాన్స్పోర్టర్). బిల్ అశోక్ డ్రైవర్. కేశవ్,(పరారీలో)దత్తా, రిసీవర్ (పరారీలో ఉన్నాడు) వీరంతా మహారాష్ట్ర కు చెందిన వారు. పైన పేర్కొన్న నిందితులు ఒకరితో ఒకరికి పరిచయాలు ఉన్నాయి.
వివేక్ మోహన్ రావ్ హావ్లే, గణేష్ మారుతీ రావు ధుమాల్ లు వారికి తెలిసిన వ్యక్తులతో సంబంధం కలిగి ఉన్నారు. సచిన్ సురేష్ గాడే,సంతోష్ బహర్ బురాడి,సామ్రాట్ సురేంద్ర మానె.బిల్ అశోక్‌తో గంజాయి రవాణా చేయడం వారికి భారీ లాభాలు చూపించి అక్రమ వ్యాపారం చేస్తూ తేలికగా డబ్బు సంపాదిస్తున్నారు. దీని ప్రకారం, A1 నుండి A6 వరకు, వారి మారుతీ ఎర్టిగా, మారుతీ స్విఫ్ట్ వాహనాలలో సిలేరుకు వెళ్లారు,కేశవ్ నుండి 200 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. కేజీకి 3,000/-చొప్పున తమ వాహనాల్లో దాచిపెట్టి, దత్తకి సరఫరా చేయడానికి సిలేరు నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు ప్రారంభించారు. భూమ్, మహారాష్ట్ర రూ. కిలోకు 20,000 చొప్పున తెల్లవారుజామున, A-1 నుండి A-6 వరకు తమ కార్లలో మహారాష్ట్రకు వెళుతుండగా, విశ్వసనీయ సమాచారం మేరకు అనుమానిత వ్యక్తులను పట్టుకుని 200 కిలోల గంజాయి నిస్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వారి ఆధీనం నుండి ఎండు గంజాయి, (02) కార్లు, (02) డూప్లికేట్ నంబర్ ప్లేట్లు,(06) మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నిందితులు వేర్వేరు నంబర్‌ ప్లేట్లను ఉపయోగించే వారు.నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ సత్యనారాయణ,యాదాద్రి భువనగిరి డీసీపీ రాజేష్, యల్ బి నగర్ డీసీపీ సాయి శ్రీ,మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, ఎస్ ఓ టీ డీసీపీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.