మనిషి జీవితంలో నిఘా నేత్రాలు కీలకం

– ఆరుట్లలో నాట్స్‌ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం
– నాట్స్‌ చైర్మన్‌ నూతి బాపయ్య చౌదరి ఉచిత కంటి వైద్య శిబిరం అభినందనీయం పాషా, నరహరి మెమోరియల్‌ ట్రస్ట్‌ రాష్ట్ర చైర్మన్‌ డీజీ నర్సింహ రావు
నవతెలంగాణ-మంచాల
మనిషి జీవితంలో నిఘా నేత్రాలు కీలకం అని నాట్స్‌ చైర్మన్‌ నూతి బా పయ్య చౌదరి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలో పాషా, నరహరి మెమోరియల్‌ ట్రస్ట్‌ సౌజన్యంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం, శంకర కంటి ఆస్పత్రి అధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిభిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నాట్స్‌ ఏర్పడి 14 సంవత్సరాలు పూర్తయ్యిందని, ఉత్తర అమెరికాలోని తెలుగు ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నామని, తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో చాల మంది నిరుపేద ప్రజలు నిఘా నేత్రాలపై అవగాహన లేక కంటి చూపును పోగొట్టు కుంటున్నారని అన్నారు. అందుకని కంటి సమస్యలున్న ప్రజలకు కంటి సమస్యలపై అవగాహన కల్పించి, ఉచితంగా ఆపరేషన్‌లు చేయిస్తున్నట్టు తెలిపారు. అంతే గాక గ్రామాల్లో మౌలిక వసతుల ఏర్పాటు కోసం నాట్స్‌ కృషి చేస్తుందని అన్నారు. పాషా, నరహరి మెమోరియల్‌ ట్రస్ట్‌ రాష్ట్ర చైర్మన్‌ డిజీ నర్సింహ రావు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్వర్యంలో అటు ఉత్తర అమెరికాలో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు సేవలు అందించడం మంచి పరిణామం అని అభినందనీయమని తెలిపారు. రానున్న రోజుల్లో రంగారెడ్డి జిల్లాలో పాషా నరహరి మెమోరియల్‌ ట్రస్ట్‌ అధ్వర్యంలో పేదప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. పాషా నరహరి మెమోరియల్‌ ట్రస్ట్‌ కార్యదర్శి, మాజీ జడ్పీటిసి పగడాల యాదయ్య మాట్లాడుతూ ఆదివారం ఆరుట్ల గ్రామంలో జరిగిన నాట్స్‌ మెగా ఉచిత కంటి వైద్య శిభిరం ప్రజలందరూ సద్వినియోగించుకుని తమ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పాషా, నరహరి మెమోరియల్‌ ట్రస్ట్‌ జిల్లా చైర్మన్‌ చంద్ర మోహన్‌, ఆరుట్ల సర్పంచ్‌ కొంగర విష్ణువర్ధన్‌ రెడ్డి , ఉప సర్పంచ్‌ పాండాల జంగయ్య గౌడ్‌ , మండల కార్యదర్శి నాగిళ్ల శ్యామ్‌ సుందర్‌, కే.శ్రీనివాస్‌ రెడ్డి, నాట్స్‌ సభ్యులు వెంకట్‌ రావు, రంగారావు, శంకర హాస్పిటల్‌ డాక్టర్‌ అనిల్‌, చేదెడ్‌ సర్పంచ్‌ బైరిక రమా కాంత్‌ రెడ్డి, పాషా, నరహరి మెమోరియల్‌ ట్రస్ట్‌ సభ్యులు పి.గోపాల్‌, పి.కృష్ణ, ఎం.బుగ్గ రాములు, సి.రాజు, ఏ.యాదయ్య, కే.జంగయ్య, పి.ప్రభాకర్‌, జీ.యాదయ్య, కే.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.