నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశానికి సుస్థిరత అనేది నేటి తక్షణావసరమని సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కళైసెల్వీ తెలిపారు. మంగళవారం కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ దేశవ్యాప్తంగా వన్ వీక్-వన్ ల్యాబ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా కళైసెల్వీ హైదరాబాద్‌లోని సీసీఎంబీలో నిర్వహించిన సమావేసంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెల్వీ మాట్లాడుతూ సుస్థిరత కోసం భిన్నమైన ల్యాబులు, శాస్త్రవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పరిశ్రమ సమిష్టి కృషి అవసరమని అభిప్రాయపడ్డారు. కోవిడ్-19 ఇలాంటి అనేక మంది భాగస్వాములను ఒక దగ్గరికి చేర్చిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినరు నందికూరి తదితరులు పాల్గొన్నారు.