ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోండి

విలేజ్‌ బస్‌ ఆఫీసర్‌ ఎల్లయ్య బస్సుల సంఖ్య పెంచితేనే గ్రామాలకు ఆర్టీసీ సేవలు కొత్లపురం సర్పంచ్‌ ప్రభాకర్‌
నవతెలంగాణ-మర్పల్లి
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ వికారాబాద్‌ బస్‌డిపో ఉద్యోగి విలేజ్‌ బస్‌ ఆఫీసర్‌ బక్క ఎల్లయ్య కోరా రు. మండలంలోని కొత్లపురం గ్రామ పంచాయతీ కార్యాల యంలో ఆదివారం సర్పంచ్‌ ప్రభాకర్‌, గ్రామ పెద్దలతో ఆర్టీసీ మార్కెటింగ్‌ పథకాలపై అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకుంటున్న విద్యార్థులకు ఉచిత బస్సు పాసులను పొందాలని, పెళ్లిళ్లకు చౌక ధరలకే బస్సులను అద్దెకు ఇవ్వ డం జరుగుతుందన్నారు. వికలాంగులకు 50 శాతం రాయి తీతో పాసులు జరుగుతుందని, ఉద్యోగస్తులకు, వ్యాపారు లకు, ఇతరులకు 20 రోజుల రాను పోనుచార్జీతో 30 రోజుల వరకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంద న్నారు, నెలవారి సీజన్‌ పాస్‌ వివరాలు, టీ 9 60 కిలోమీటర్లు 100 రూపాయలకే మహిళలకు, వృద్ధులకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రయాణం చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లన్నారు. సర్పంచులు, గ్రామ పెద్దలు ఫోన్‌ నంబర్ల ద్వారా విలేజ్‌ బస్‌ ఆఫీసర్‌ పరస్పర సమాచారంతో పెళ్లిళ్లకు, జాతరలకు, విహార యాత్రలకు, దేవాలయాలకు వెళ్లేందుకు తక్కువ ఖర్చుతో ఆర్టీసీ సేవలను పొందాలని సర్పంచ్‌ ప్రభాకర్‌కు గ్రామ పెద్దలకు సూచించారు. బస్సుల సంఖ్య పెంచితేనే గ్రామాలకు ఆర్టీసీ సేవలు ఆర్టీసీ అధికారులు డిపోల్లో బస్సుల సంఖ్యను పెంచి గ్రామాలకు విస్తరిస్తేనే ఆర్టీసీ సేవలు ప్రజలు పొందే అవకాశముందని సర్పంచ్‌ ప్రభాకర్‌ అధికారులకు సూచించారు. మర్పల్లి మండల కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా గ్రామానికి ఆటోలు తప్ప బస్సులు లేవని, మండలంలోని ఏ గ్రామా నికి కూడా ఆర్టీసీ బస్సులు రావడంలేదని ఆయన ఆరో పించారు. 30,40 సంవత్సరాలుగా నడుస్తున్న బస్సులను ఆర్టీసీ అధికారులు రద్దుచేసి రవాణా వ్యవస్థను విచ్ఛిన్నం చేశారని ఆయన మండిపడ్డారు. రవాణా సేవలను పెంచా ల్సిన అధికారులే ఉన్న బస్సులను రద్దు చేయడంతో ప్రయివేట్‌ వాహనా ల్లోనే ప్రయాణం ప్రజలకు దాపరిచిందన్నారు. బస్సులు రద్దు కావడంతో ఎంతోమంది విద్యార్థు లు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్ళని పరిస్థితి నెలకొం దన్నారు. బంటారం, తోర్‌మామిడి, పంచలింగాల్‌, కల్కూడ, జహీరాబాద్‌, హైదరాబాద్‌, వికారాబాద్‌, సదాశివపేట్‌, బుదేరా, కోహిర్‌, తాండూర్‌, పట్టణాలు గ్రామాలకు గతంలో నడిచిన బస్సులను వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా పై అధికారులు డిపోల్లో బస్సుల సంఖ్యను పెంచి రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు ఆయన వినతిపత్రం అందించారు. వికారాబాద్‌, హైదరాబాద్‌, జహీరాబాద్‌, తాండూర్‌ డిపోల నుండి అధికారులు మర్పల్లి మండల కేంద్రానికి బస్సులు నడపాలని ఆయన కోరారు, కార్యక్రమంలో గ్రామపెద్దలు పాల్గొన్నారు.