జూనియర్‌ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలి

– ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌
– బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు సీఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌
నవతెలంగాణ-తలకొండపల్లి
మండల కేంద్రంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బాలబాలికల విద్యకు ప్రాధాన్యతను ఇస్తు జూనియర్‌ కళాశాలను మంజూరు చేసిందని ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ తెలిపారు. జూనియర్‌ కళాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన జూనియర్‌ కళాశాల తరగతి గదులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మంజూరైన సందర్భంగా ప్రభుత్వ ఉన్నంత పాఠశాలలో 2023-24 అకాడమిక్‌ ఇయర్‌ విద్యను విద్యార్థులకు అందజేయాలని ప్రభుత్వం జీవో మంజూరు చేసిందని తెలిపారు. మండల కేంద్రం, వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు జూనియర్‌ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వివిధ కోర్సులకు సంబంధించిన వివరాలను వివరించారు. జూనియర్‌ కళాశాలకు నైపుణ్యం గల లెక్చరర్లను ప్రభుత్వం నుంచి నియమిస్తామని, విద్యార్థులను ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు పంపేలా చూడాలని తెలిపారు. ఎన్నో ఏండ్లుగా కోరుకుంటున్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల తలకొండపల్లి మండలానికి మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం తలకొండపల్లి టూ మిడ్జిల్‌ ప్రధాన రహదరిలో బ్రిడ్జిల దగ్గర మిగిలిన బీటీ రోడ్డును ప్రారంభించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీకాంత్‌, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు సీఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, సీఐ వెంకటేశ్వర్లు , ఎస్‌ఐ వెంకటేష్‌, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు పద్మ నరసింహ, సీనియర్‌ నాయకుడు దశరథ్‌ నాయక్‌, స్థానిక సర్పంచ్‌ లలిత జ్యోతయ్య, వివిధ గ్రామాల సర్పంచులు హైమావతి రమేష్‌, ఈశ్వర్‌ నాయక్‌, రమేష్‌, జయమ్మ వెంకటయ్య, ధరణి శివశంకర్‌ రెడ్డి , శ్యాంసుందర్‌ రెడ్డి, వరలక్ష్మి రాజేందర్‌ రెడ్డి, ఎంపీటీసీలు సరిత గణేష్‌ గుప్తా, బీఆర్‌ఎస్‌ తలకొండపల్లి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, మాజీ ఎంపీటీసీ యాదయ్య, ఉప సర్పంచ్‌ అనిల్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు బత్తుల బాల కుమార్‌ గౌడ్‌, వెంకటయ్య, డైరెక్టర్‌ నూక శేఖర్‌, ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.