– అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు
నవతెలంగాణ-పాల్వంచ
బాలల సంరక్షణతో పాటు వారి ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమం, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు తెలిపారు. శనివారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ ద్వారా సమీక్ష సమావేశం జరిగింది. చైల్డ్ కేర్ ప్లాన్ కింద ప్రతి మూడు నెలలకు ఒకసారి పిల్లల ఆరోగ్యం, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాల బాలికలకు స్కిల్ డెవలప్మెంట్ పరంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఏడుగురు బాల కార్మికులను రక్షించి బాల సదన్‌కు తరలించినట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటివరకు ఇటలీకి ఇద్దరు, అమెరికాకి ఇద్దరు, ఇతర దేశాలకు 17 మంది పిల్లల్ని కలెక్టర్ ఆధ్వర్యంలో పిల్లల, దత్తత తీసుకునే తల్లిదండ్రుల ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు తనిఖీ చేసి సంతృప్తి చెందిన పిదప, చట్ట ప్రకారం అన్ని విధివిధానాలు పూర్తి చేసి మొత్తం 19 మంది పిల్లల్ని వారి బంగారు భవిష్యత్తుపై ఉత్తమ కుటుంబాల తల్లిదండ్రులకు దత్తత ఇచ్చినట్లు సంక్షేమ అధికారిని విజేత తెలిపారు. బాల్యవివాహాల్ని అరికట్టడంలో భాగంగా 2017లో 18, 2018లో 18, 2019లో-29, 2020లో-25, 2021 లో-17, 2022లో-50, 2023లో -50, 2004లో నేటి వరకు-1 బాల్యవివాహాల్ని ఆపినట్లు ఆమె తెలిపారు. మిషన్ వాత్సల్య స్కీం అనుసరించి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా 714 మందికి నెలకు 4000 చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పర్యటించి బాలికల పాఠశాలల్లో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌పీ విజరు కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారిని ఇందిర, మైనారిటీ వెల్ఫేర్ అధికారి సంజీవరావు, డిసిపిఓ ఎం.హరి కుమారి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రవి, డబ్ల్యూ సి మెంబర్స్ సుమిత్ర, అంబేద్కర్, సాధిక్ పాషా, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.