బీటెక్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో ‘సాయిస్ఫూర్తి’ విద్యార్థుల ప్రతిభ

– అభినందనలు తెలిపిన ఎంపీ డాక్టర్‌ బండి
నవతెలంగాణ-సత్తుపల్లి
జేఎన్‌టీయూహెచ్‌ గురువారం విడుదల చేసిన బీటెక్‌ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాల్లో సత్తుపల్లి మండలం గంగారం సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్‌ విద్యార్థులు అత్యంత ప్రతిభను కనబర్చి ఉత్తమ ఎస్‌జీపీఏ సాధించి జిల్లాలో అగ్రగామిగా నిలిచారు. ఈఈఈ విభాగంలో ఎస్కే రహమత్‌ 9.3/10ఎస్‌జీపీఏ, కనపర్తి గోపీచంద్‌ 8.75/10, మందలోజు మేఘన 8.6/10 ఎస్‌జీపీఏ సాధించారు. ఈసీఈ విభాగంలో చిలకమర్తి సత్యహర్షిత 9.15/10 ఎస్‌జీపీఏ, నల్లపు శ్రీదివ్య 8.9/10, తొర్లపాటి రమ్య 8.7/10, సీఎస్‌ఈ విభాగంలో తడికమళ్ల పుష్పలత 9.50/10, నాగళ్ల ఇందు 9.48/10, పాలెం హరికీర్తి 9.28/10, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ మిషిన్‌ లెర్నింగ్‌ విభాగంలో చిరుమామిళ్ల వర్షిణి 9.5/10, నారాయణవరపు తేజశ్రీ 8.65/10, అడపా భరణి 8.55/10 చొప్పున బ్రాంచీల వారీగా ఉత్తమ ఎస్‌జీపీఏ సాధించారని కళాశాల ప్రిన్సిపాల్‌ వూట్కూరి శేషారత్నకుమారి తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఉద్దేశించి కళాశాల ఛైర్మెన్‌, ఎంపీ డాక్టర్‌ బండి పార్థసారధిరెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్‌ ట్రస్టీ బండి అన్విద వర్చువల్‌గా మాట్లాడారు. అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థుల కృషి అభినందనీయమన్నారు. ప్రిన్సిపాల్‌ శేషారత్నకుమారి మాట్లాడుతూ జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో మంచి అకడమిక్‌ ఎక్స్‌లెన్స్‌పు సాధించే అతికొద్ది కళాశాలల్లో సాయిస్ఫూర్తి కళశాల ఉండటం గర్వకారణమన్నారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల సెక్రెటరీ అండ్‌ కరస్పాండెంట్‌ దాసరి ప్రభాకరరెడ్డి, కళాశాల చీఫ్‌ కౌన్సెలర్‌ కేవీ జవహర్‌బాబు, వివిధ విభాగాధిపతులు కోట రామకృష్ణప్రసాద్‌, డాక్టర్‌ పాముల శేఖరబాబు, షేక్‌ యాకూబ్‌, అడబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.