ఎవరో వారు..
నగరం నడిబొడ్డున
రెండో, మూడో, నాలుగో
ఇంకా పైపై అంతస్థులోనో..
నాలుగు గోడల మధ్య
ఏసీ గదిలో దర్జాగా
కునుకు తీస్తూ కూర్చొని
బోధనా సోపానాలు..
అభ్యసన సామర్థ్యాలు..
ఇలాగే ఉండాలని చెబితే
మనంగుడ్డిగా అనుసరిస్తున్నాం!
ఇదిక్కడే చెప్పాలి..
అదక్కడే ఉండాలి..
ఇన్ని నిమిషాల్లోనే ముగించాలి..
What a bloody rule?!
మై డియర్ రిసెర్చర్ !
Do you accept…
Universal Method ?!
ఇగ దూరాలెందుకు పెరుగరు!
దారులెట్ల దగ్గరవడుతరు!!
రూపాలు, వరుసక్రమాలు
మార్చితే ఏం లాభం మిష్టర్!
స్వరూపం అట్లనే ఉంటది కదా!!
బొమ్మను చూపించి
లిపి, నేర్పించడం కాదు!
అక్షరాలు చెప్పి
బొమ్మను గీయించాలి
మై డియర్ కో ఆర్టినేటర్!!
ఎక్కడ మొదలు పెట్టాలో..
ఏదెంత చెప్పాలో..
ఎప్పుడు ముగించాలో..
Everybody knows!
Who are you to tell?
Leave them alone bro..!!
నువ్వు బలవంతంగ
కలిపికుట్టిన ఆ చేతి పుస్తకం
ఓ కలగూర గంప!
ఏమేం నేర్చుకోవాలో..
ఏదెంత తెలుసుకోవాలో..
విద్యార్థికి రెక్కలివ్వండి చాలు!
దయచేసి ఊపిరాడట్లేదు
ఆ తరగతి గది గోడలు కూల్చండి!!
– అశోక్ అవారి, 9000576581