తెలంగాణ పాలనే ఎజెండాగా…

– మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ విస్తరణ సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ మోడల్‌ పాలనే ఎజెండాగా మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ విస్త రణను 288 నియోజకవర్గాల్లో చేపట్టాలని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రతి గ్రామంలోనూ అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో తొమ్మిది కమిటీలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు పెద్దఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు మహారాష్ట్ర నుండి సీఎం కేసీఆర్‌ సమక్షంలో పలువురు ఆ పార్టీ లో చేరారు. వారందరికీ సీఎం గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో రైతులు సహా అన్ని వ ర్గాల ప్రజలకందిస్తున్న సంక్షేమ పాలన మోడల్‌పై కరపత్రాలు, బుక్‌లెట్స్‌ , సోషల్‌ మీడియా, పోస్టర్స్‌, హౌర్డింగ్స్‌ ద్వారా మహారాష్ట్రలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రజలకు కూడా తెలంగాణలో అమల వుతున్న పథకాలందించాలనే స్పూర్తితో బీఆర్‌ఎస్‌ పని చేస్తుందన్నారు.