వ్యవసాయ రంగంలో అద్భుత ప్రగతి సాధించిన తెలంగాణ

– రైతు దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్‌
– రైతుబంధు, రైతుబీమా,ఉచిత విద్యుత్‌లో ఘనత
నవతెలంగాణ-శంషాబాద్‌
తెలంగాణ స్వరాష్ట్రం వ్యవసాయ రంగంలో అద్భుత ప్రగతి సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాజేంద్ర నగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్‌ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శంషాబాద్‌ మండల పరిధిలోని మల్కారం గ్రామంలోని రైతు వేదికలో మండల రెవెన్యూ, మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిం చిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మల్కారం గ్రామ సర్పంచ్‌ కొత్త మాధవి యాదగిరి రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు.. మిషన్‌ కాకతీయ పథకంతో చెరువులన్నీ జలకళ సంతరించుకున్నాయని తెలిపారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి గ్రామాల్లో వ్యవసాయం అద్భుత ప్రగతి సాధించిం దన్నారు. రైతుబంధు పథకం ప్రవేశపెట్టి సంవత్సరానికి రెండు దఫాలుగా ఎకరకు రూ. 10వేలు అందిస్తున్నట్టు తెలిపారు. రైతుబీమాతో చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకుంటున్నామని తెలిపారు. వ్యవసాయానికి 24 గం టల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని తెలిపారు. నకిలీ విత్త నాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని అన్నారు. రైతులు తమ సమస్యలను మాట్లాడుకోవడానికి వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అమలు కోసం రైతు వేదికల నిర్మాణం చేశారన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రైతులందరూ అండగా నిలవాలని కోరారు. రాజేంద్రనగర్‌ ఆర్టీవో చంద్రకళ మాట్లాడుతూ ధరణి పోర్టల్‌ వల్ల భూము ల సమస్యలు అత్యంత సులభంగా పరిష్కారం అవుతున్నా యని అన్నారు. హరితహారం వంటి కార్యక్ర మాల ద్వారా వర్షాలు పడి భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్‌, జడ్పీటీసీ నీరటి తన్విరాజుముదిరాజ్‌, వైస్‌ ఎం పీపీ నీలం మోహన్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కే సుష్మ మ హేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ బండి గోపాల్‌యాదవ్‌, తహసీ ల్దార్‌ ఆర్‌.శ్రీనివాసరెడ్డి, ఏడీఏ లీనా రెడ్డి, ఏఈఓ విజయ భారతి, ఎంఏవో ఎన్‌.కవిత, మండల పశు వైద్యాధికారి వెన్నెల ఉమాకాంత్‌, ఏఈ సూర్యనారా యణ, సర్పంచులు దండు ఇస్తారి, హాస్లిరాములు, దేవిక జగన్‌గౌడ్‌, కోడూరు నరసమ్మ, నార్సింగి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దూడల వెంకటేష్‌గౌడ్‌, మల్కారం పీఏసీఎస్‌ చైర్మన్‌ బూ ర్కుంట సతీష్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు కే.చంద్రా రెడ్డి, యువజన విభాగం మండల అధ్యక్షులు ఎన్‌.రాజశేఖ ర్‌గౌడ్‌, నాయకులు మైలారం భిక్షపతి, నీరటీ శేఖర్‌, సందనవెల్లి శ్రీనివాస్‌, హీరేకార్‌ శివాజీ, బి.మహేష్‌, పి.బ ల్వంత్‌, జి.మల్లికార్జున్‌, కె.సుధాకర్‌గౌడ్‌, కే.బాల్‌రాజ్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.