తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి

– డైరెక్టర్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ ప్లానింగ్‌
– జి.వెంకటేశ్వర రెడ్డి
నవతెలంగాణ-మణుగూరు
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను సింగరేణిలో ఘనంగా నిర్వహించాలని డైరెక్టర్‌ ప్రాజెక్ట్‌ అండ్‌ ప్లానింగ్‌ జి.వెంకటేశ్వర్‌ రెడ్డి అన్నారు. ఆదివారం మణుగూరు ఏరియా జనరల్‌ మేనేజర్‌ దుర్గం రామచందర్‌, గుర్తింపు సంఘం ఉప అధ్యక్షులు శ్రీ వి ప్రభాకర్‌ రావుతో కలిసి మణుగూరులో పర్యటించారు. సంబంధిత అధికారులతో కలిసి మొదటిగా జూన్‌ రెండవ తేదీన అన్ని గనుల, డిపార్ట్మెంట్‌ల వద్ద జరపబోయే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను పరిశీలించారు. జూన్‌ 5వ తేదీన భద్రాద్రి స్టేడియం నందు జరుపబోయే తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సమీక్ష నిర్వహించారు. అనంతరం భద్రాద్రి స్టేడియం నందు చేయబోయే ఏర్పాట్లను కూడా అడిగి తెలుసుకున్నారు. తగు సూచనలు చేసి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించమని సూచించారు. సందర్షులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండ అన్ని ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రెట్టింపు ఉత్పత్తిని మణుగూరు ఏరియా ఉద్యోగులందరూ సమిష్టి కృషితో సాధించాలన్నారు. మణుగూరు ఉద్యోగుల స్ఫూర్తిని చాటుకోవాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మణుగూరు వ్యాప్తంగా జూన్‌ 5వ తేదీన సింగరేణి సంబురాలను ఘనంగా నిర్వహించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా భద్రాద్రి స్టేడియం నందు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు సింగరేణి ప్రగతికి సంబంధించిన ఫోటోలను సందర్శించుటకై ఫోటో గ్యాలరీనీ సందర్శకులు తిలకించి విధంగా ఏర్పాటు చేయమని సూచించారు. అనంతరం డైరెక్టర్‌ ప్లానింగ్‌ జి.వెంకటేశ్వర రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ఓసీ-4 వ్యు పాయింట్‌, కేపియుజి గనిని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఏజెంట్‌ కొండాపురం జి.నాగేశ్వరావు, ఎస్‌ఓ టు జిఎం డి.లలిత్‌ కుమార్‌, ఏజిఎం సివిల్‌ డి.వెంకటేశ్వర్లు, ఏరియా ఇంజనీర్‌ నర్సిరెడ్డి, ఎడిట్‌ ఆఫీసర్‌ పీకే ఓసి టి.లక్ష్మీపతి గౌడ్‌, మేనేజర్‌ కొండాపురం బి.వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎస్‌.ఈ.మధుసూధన్‌ రావు, శోభన్‌ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.