అక్బరుద్దీన్‌కు కృతజ్ఞతలు

Thanks to Akbaruddin– ఆల్‌ యూనివర్సిటీస్‌ కాంట్రాక్ట్‌ టీచర్స్‌ జేఏసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులర్‌ చేయాలని శాసనసభా సమావేశాల్లో ప్రభుత్వాన్ని కోరినందుకు ఎంఐఎం ఫ్లోర్‌ లీడర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీకి తెలంగాణ ఆల్‌ యూనివర్సిటీస్‌ కాంట్రాక్ట్‌ టీచర్స్‌ జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఆదివారం జేఏసీ వర్కింగ్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఎం.రామేశ్వరరావు, చైర్మెన్‌ డాక్టర్‌ శ్రీధర్‌ కుమార్‌ లోధ్‌ నేతృత్వంలో ప్రతినిధులు అక్బరుద్దీన్‌ ఓవైసీని కలిశారు. తమ రెగ్యులరైజేషన్‌ జరిగేంత వరకు ఇదే విధమైన కృషిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.