బరువు తగ్గడానికి చాలానే మార్గాలు ఉన్నాయి. అయితే సరైన విధానంలోనే బరువు తగ్గాలి. ఇంటర్నెట్‌లో వెతికి ఎలా అయినా బరువు తగ్గాలని ప్రతి ఒక్కటి పాటించొద్దు. ఈ నేపథ్యంలోనే ఫిటెనెస్ నిపుణులు బరువు తగ్గేటప్పుడు కొన్ని తప్పులు చేయొద్దొని చెబుతున్నారు. అవేంటంటే.
బరువు తగ్గడం మాత్రమే గోల్ పెట్టుకోకూడదు. ఫిట్‌గా మారుతూనే ఆరోగ్యంగా కూడా ఉండాలి. బలం, ఫ్లెక్సీబిలిటీ, నడుము చుట్టుకొలత ఇవన్నీ కూడా చూడాలి. ఇవన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటేనే బరువు తగ్గినట్లని చెబుతున్నారు.
గత అనుభవాన్ని ప్రస్తుత అనుభవంతో పోల్చొద్దు. గతంలో తీసుకున్న డైట్ అప్పుడు వర్కౌట్ అవ్వలేదని మంచి డైట్‌ని పక్కన పెట్టొద్దు. ఎప్పుడైనా సరే, మంచి డైట్ పాటించాలి. అదే విధంగా రోజులు మారే కొద్దీ కొన్ని మార్పులు వస్తాయి. ప్రస్తుతం మీ బాడీ టైప్‌ని బట్టి ఎలాంటి డైట్ అనేది సెట్ అవుతుందో న్యూట్రిషనిస్ట్ అడిగి కచ్చితంగా ఫాలో అవ్వాలి. దీని వల్ల ఒత్తిడి తగ్గి బరువు కూడా తగ్గుతారు.
డైట్‌ని ఫాలో అవుతున్నప్పుడు వెంటనే బరువు తగ్గాలని ట్రై చేయొచ్చు. మెల్లిమెల్లిగా బరువు తగ్గాలి. ఏ రిజల్ట్ అయినా రావడానికి కనీసం మూడు నెలల టైమ్ పడుతుంది.
ఎప్పుడైనా సరే బరువు తగ్గడం, డైట్ ఫాలో అవ్వడం అనేది ఏదో శిక్షలా ఫీల్ అవ్వొద్దు. వీటిని ఎంజారు చేస్తూ చేయాలి. వర్కౌట్ అనేది కూడా హ్యాపీగా ఎంజారు చేస్తూ చేయండి. డైట్‌లో కూడా తినే ఫుడ్‌ని రుచిగా చేసుకుని ఎంజారు చేస్తూ తినండి. అప్పుడే మీరు వాటిని కంటిన్యూ చేసి హ్యాపీగా బరువు తగ్గుతారు. ప