పేద కుటుంబానికి వైద్యం అందించడమే లక్ష్యం

– రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్‌
ప్రతి పేద కుటుంబానికి వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. అందులో భాగంగానే బస్తీ దావాఖానలు ప్రారంభించి పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. సోమవారం మేడ్చల్‌ మున్సిపల్‌ పరిధిలోని 18, 9వ వార్డుల్లో బస్తీ దావఖానాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం 16వ వార్డులో రూ.52 లక్షల నిధుల నిర్మించిన సీసీ రోడ్డు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు, 11 వార్డులో రూ.11 లక్షల నిధులతో చేపట్టిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సీఎం కేసీఆర్‌ బస్తీ దవఖానలను ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గ అభివద్ధి ధ్యేయంగా నిరంతరం పని చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్‌-మల్కాజిగిరి డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్‌, మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌ మర్రి దీపిక నర్సింహరెడ్డి, మున్సిపల్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు శేఖర్‌ గౌడ్‌, కౌన్సిలర్లు కౌడే మహేష్‌, తుడుం గణేష్‌, ఉమా నాగరాజ్‌, మానస శ్రవణ్‌ గుప్త, మర్రి శ్రీనివాస్‌ రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్‌ రెడ్డి, హరికష్ణ యాదవ్‌, లావణ్య హన్మంత్‌ రెడ్డి, భవాని రాఘవేందర్‌ గౌడ్‌, కో-ఆప్షన్‌ సభ్యులు గీత వంజరి, మాజీ ఉప సర్పంచ్‌ మర్రి నర్సింహ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.