దగ్గరికి వస్తున్న ఎలక్షన్లు.. మారుతున్న సమీకరణాలు

నవతెలంగాణ – రేవల్లి
రేవల్లి మండల కేంద్రంలో గత కొద్ది రోజుల రాజకీయంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నట్టుగా సమాచారం తెలియ వస్తుంది. దీనికి నిదర్శనం ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీకి,  ఇంకొక పార్టీ నుంచి మరొక పార్టీకి కార్యకర్తలు వలస వెళ్లడం అనేది నిదర్శనంగా చూపవచ్చు. నిన్నటికి నిన్న కొందరు కార్యకర్తలు ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి ( 30 ) మంది దాకా వెళితే,  మరొక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి ఇంకో ( 30 ) మంది కార్యకర్తలు వెళ్లడం జరిగింది. దీనికి సంబంధించిన రుజువులు కూడా మనం పత్రికాపరంగా మరియు రేవెల్లి మండలంలో స్థానికంగా జరిగిన సంభాషణలు, సమూహ విశ్లేషణలను చూస్తే, వింటే అర్థమవుతుంది. తాము చేసిన అభివృద్ధిని చూపిస్తూ ముందుకు వెళుతున్నటువంటి  బి.ఆర్.ఎస్ పార్టీ ఒకపక్క, అదే విధంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరొక ప్రక్క, ఎత్తులకు పై ఎత్తులను వేస్తూ ముందుకు సాగుతున్నాయి. బి ఆర్ ఎస్ పార్టీ తమ చేస్తున్న అభివృద్ధిని చూపిస్తూ ప్రజలకు విన్నవిస్తూ ఉంటే, అదే కాంగ్రెస్ పార్టీ వారు, బి ఆర్ ఎస్ పార్టీ చేయనటువంటి కార్యక్రమాలు గాలికి వదిలేసినటువంటి పనులను చూపిస్తూ, వారు చేసినాము అని అభివృద్ధి చెప్పుకుంటున్నటువంటి పనుల విషయంలో ఉన్న అవకతవకలను ప్రజలకు వివరిస్తూ, వారి వారి పార్టీల బలాబలాలను పెంచుకోవడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇందులో ఎంతమంది ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వెళ్లారో ఎవరికి అర్థం కాని విషయంగా ఉంది. ఇదే విధంగా కొనసాగితే ఎవరికి ఏ విధంగా ఎంతవరకు మెజార్టీ ఉంటుందో రేవల్లి మండలంలో చెప్పే పరిస్థితి ప్రస్తుతం అయితే లేదు. అందరూ కూడా తమకు తామే అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ప్రతి పార్టీలోనూ వ్యతిరేకత ఉంది అనేది నిజం. అది ఇప్పుడు బయటపడకపోయినా కూడా రాను రాను రోజుల్లో తప్పకుండా పడుతుంది అని విశ్వాసనీయ సమాచారం. ఒక పార్టీలో ఉన్నవాళ్లు ఆ పార్టీలో ఆ పార్టీపై వ్యతిరేకత ఉండి ఇంకొక పార్టీకి వెళుతున్నారు అనేది జగమెరిగిన సత్యం. ఈ విధంగా పోతే చివరికి రానున్న అసెంబ్లీ ఎన్నికలలో నువ్వా నేనా అనే విధానంలో ఎలక్షన్స్ జరగడం ఖాయం. ఇక మీదట ఏ విధంగా ఎలాంటి సమీకరణాలు చోటు చేసుకుంటాయో, ఇప్పటివరకు జరిగిన విధంగా ఉంటాయా లేక ఏమైనా బుజ్జగింపులు జరిగి ఆగిపోతాయా వేచి చూడాలి. ఈ విషయాలన్నీ తెలిసింది నవతెలంగాణ పత్రిక చేపట్టిన సర్వే 83/100 ఆధారంగా మాత్రమే . కాలమే దీనికి సమాధానం చెబుతుంది.