– ఉద్యోగ జేఏసీ చైర్మన్ రాజేందర్, సెక్రెటరీ జనరల్ మమత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలే, దేశం ఆశ్చర్యపోయే విధంగా మళ్లీ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామంటూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషకరమని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, సెక్రెటరీ జనరల్ వి. మమత, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, టీజీవో ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గతంలోనే ఒకసారి 43 శాతం, మరోసారి 30 శాతం వేతనాలు పెంచిన ఘనత కేసీఆర్నని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలోనే రెండో వేతన సవరణ సంఘాన్ని వేసి, త్వరలోనే వేతనాలను బ్రహ్మాండంగా పెంచుతామంటూ ప్రకటించడం గొప్ప విషయమని వివరించారు.