ఆంగ్లేయులు పాలన నుండి విముక్తి కలిగిన రోజు

– తాసిల్దార్ అల్లం రాజకుమార్

నవతెలంగాణ-గోవిందరావుపేట
తెల్ల దొరల పరిపాలన నుండి భారతదేశానికి విముక్తి కలిగిన రోజునే స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని తాసిల్దార్ అల్లం రాజకుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తాసిల్దార్ అల్లం రాజకుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను దివంగత స్వాతంత్ర పోరాట యోధులను స్మరిస్తూ పూలతో నివాళులు అర్పించారు. జెండా ఆవిష్కరణ సందర్భంగా పసర పోలీస్ స్టేషన్ పోలీసులు చేసిన పరేడ్ స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. పాఠశాల విద్యార్థులు కార్యాలయంలో జెండా ఆవష్కరణ సందర్భంగా హాజరై జాతీయ గీతాన్ని ఆలపించారు.