హెల్త్ వెల్నెస్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి..

నవతెలంగాణ -తాడ్వాయి : మండలంలోని రంగాపూర్ హెల్త్ వెల్నెస్ సెంటర్ ను జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య, స్థానిక సర్పంచ్ ఇర్ప అశ్విని సూర్యనారాయణ తో కలిసి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎం.ఎల్.హెచ్.పి, వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా అల్లెం అప్పయ్య మాట్లాడుతూ వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. పేద ప్రజలకు నమ్మకం కలిగించేలా నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ప్రజల ఆరోగ్యం ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు.