లిప్త కాలపు స్వప్నం

లిప్త కాలపు స్వప్నమై ద్రవీభవించిన
ఆమెను అదిమిపట్టేందుకు,
రెప్పల తలుపుల్ని ఎంత గట్టిగా మూసినా,
అశ్రువై రాలేందుకే ఇష్టపడుతుంది.
గుర్తొచ్చే ఆ క్షణమైనా కుదురుగా ఉంటేగా…
యుగానికి సరిపడా విషాదాన్ని సష్టిస్తుంది…!
అలజడులేం కొత్త కాదు కానీ,
అలజడి తర్వాత పుట్టే నిశ్శబ్దం,
అలజడి కన్నా వేల రెట్లు భయంకరంగా వుంటుంది,
ఇప్పుడు గదినిండా స్మశాన వైరాగ్యం,
మదినిండా దిగులూ, నైరాశ్యం…
లోనా, బయటా పెను నిశ్శబ్దం…
ఈ నిశ్శబ్దాన్ని కూలగొడతానో…?
ఇదే నిశ్శబ్దంలో కూరుకుపోతానో…?
ఇక కాలమే నిర్ణయించాలి…!
– జాబేర్‌పాషా, 00968 78531638