శాస్త్ర సంకేతిక రంగాల్లో మహిళలు చేసిన కృషిని అభినందించాలి

– భారత విద్యార్థి ఫెడరేషన్ 

నవతెలంగాణ- కంటేశ్వర్
శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు చేసిన కృషిని అభినందించాలి అని భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకులు తెలిపారు. ఈ మేరకు గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలో నిన్న ఇస్రో సాధించిన చంద్రయాన్ -3 మిషన్ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్క సైంటిస్ట్, ఇంజనీర్లకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ విజయోత్సవ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ నగర ఉపాధ్యక్షులు హెచ్ గణేష్ మాట్లాడుతూ.. భారతదేశం అనేక దేశాల వలసరాజ్యంలో ఉండి స్వాతంత్రం సాధించుకొని ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో ప్రపంచంలోనే శక్తివంతమైన అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతూ శాస్త్ర సాంకేతిక రంగంలో విజయాలను సాధిస్తుందని అన్నారు. అదేవిధంగా నిన్న ఇస్రో సైంటిస్టులు చంద్రయాన్ -3 మిషన్ విజయవంతంగా పూర్తి చేసి ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలాగా చేసారని ,మరి ముఖ్యంగా మహిళలు ఒకప్పుడు బయటకు వచ్చి చుడువుకోడమే గగనం అనే రోజుల నుండి నేడు గగన ఉపరితలలకు ఎదిగి, ఈ చంద్రయాన్ -3 విజయవంతానికి కృషి చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ అభివృద్ధి కొరకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి రానున్న కాలంలో మరిన్ని ఆవిష్కరణలకు, ప్రయోగాలకు రేపటి తరానికి అందేరకంగా చర్యలు తీసుకోవాలని అన్నారు అదేవిధంగా విద్యార్థులు కూడా ఈ మిషన్ ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మంచి సైంటిస్టులుగా మేధావులుగా తయారవ్వాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నగర నాయకులు బాబురావు, వరదరాజు, సురేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.