– కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మురళి నాయక్
నవతెలంగాణ-ఇనుగుర్తి
రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనకు జరమగీతం పాడాలని మహబూబాబాద్ డిసిసి జిల్లా అధ్యక్షుడు జన్నా రెడ్డి భరత్ చందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మురళి నాయక్ పిలుపు నిచ్చారు. ఆదివారం ఇనుగుర్తి మండలంలోని చిన్న నాగారం గ్రామంలో ముత్యాలమ్మ త ల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి గ్రామంలో ప్రచా రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలలో తాను అత్యధిక మెజార్టీతో ఘనవిజ యం సాధించడం తద్యమని ధీమా వ్యక్తం చేశారు. టిఆర్ ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అధిక శాతం ఆపార్టీ కార్య కర్తలకే ఇవ్వడంతో, మిగిలిన ప్రజలకు అన్యాయం జరుగు తుందని మండిపడ్డారు. దళిత బంధు, బీసీ బంధు, గృహ లక్ష్మి వంటి అనేక పథకాలను అవినీతి మయం చేశారని, కేవలం పార్టీ కార్యకర్తలకు వర్తింపజేశారన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల వల్ల సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే వారికి ఓట్లతో బుద్ధి చెబుతారని,ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదన్నారు. అధికారంలోకి రావ డంతో పాటు మానుకోట గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. ముందుగా ఇనుగుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురెళ్ళి సతీష్, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ బైరు అశోక్ గౌడ్, ఆయా గ్రామ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. చిన్న నాగా రం గ్రామంలో 50కుటుంబాలు,100మంది కార్యకర్తలు, మీట్యా తండాలో 20 కుటుంబాలు, లాలూ తండాలో 15 కుటుంబాలు, ఇనుగుర్తిలో మాల సంక్షేమ సంఘం నుండి 50 మంది, యువకులు 30 మంది, అయ్యగారిపల్లి గ్రా మంలో 15 కుటుంబాలు పార్టీలో చేరారు. వారికి జిల్లా అధ్యక్షుడు భరత్ చందర్‌రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలో కి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు దస్రు నాయక్, కిసాన్ సేల్ జిల్లా ప్రధాన కార్య దర్శి కోటం మహేందర్ రెడ్డి,అధికార ప్రతినిధి మలిశెట్టి శ్యామ్, జిల్లా నాయకుడు గుజ్జునూరి బాబురావు, గంజి రాజేందర్ రెడ్డి, మామిడి జనార్ధన్, తుమ్మనపల్లి సతీష్, బానోతు లోకేష్ నాయక్, జాటోత్ కిషన్, మండల మహిళ అధ్యక్షురాలు ఒర్రె కవిత, యూత్ అధ్యక్షుడు జగన్, పట్టణ యూత్ అధ్యక్షుడు గండు అజరు, తెలంగాణ ఉద్యమకా రుడు చిన్నాలకట్టయ్య, గంజి శ్రీనివాస్ రెడ్డి, వల్లముల మురళి, సీనియర్ నాయకులు, యువకులు, కాంగ్రెస్ కా ర్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.