తెలంగాణలో బీజేపీ ఖతం: వీహెచ్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఖతమైందని మాజీ ఎంపీ వి హనుమంతరావు చెప్పారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రధాని మోడీ ఇప్పటి వరకు బీసీలకు ఏం చేయలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తామంటూ రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి పార్లమెంట్‌లో బీసీలకు మూడు సీట్లు కేటాయించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు.