నోట్ల రద్దుతో తగిన మూల్యం చెల్లించక తప్పదు

మోడీకి మహేష్‌కుమార్‌ హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
నోట్ల రద్దు చేసినందుకు తగిన మూల్యం చెల్లించకతప్పదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ ప్రధాని మోడీని హెచ్చరించారు.2016 పెద్ద నోట్ల రద్దు తీసుకొచ్చిన మోడీ కొన్ని వేల మంది చావుకు కారణం అయ్యారని ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద నోట్లు రద్దు చేసి అంతకంటే పెద్ద నోటు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. అప్పుడు ఆ నోట్ల రద్దు ఎవరి కోసం చేశారు? ఇప్పుడు ఎందుకు కోసం రూ 2000 నోటు రద్దు చేశారని ప్రశ్నించారు. పారిశ్రామిక వేత్తల సౌకర్యం కోసమా? అని నిలదీశారు. ఆరేండ్లలో లాభపడి ఇప్పుడు రద్దు చేయడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. పార్టీ సీనియర్‌ నేత షబ్బీర్‌ రెండువేల నోట్ల రద్దును తప్పుపట్టారు.

Spread the love