‘రాష్ట్ర ఆవిర్భావ ఫలాలు దళిత బహుజన జాతులకు దక్కలేదు’

నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఫలాలు ఈ తొమ్మిదేండ్ల కాలంలో దళిత బహుజన జాతులకు దక్కలేదని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కష్ణ స్వరూప్‌ అన్నారు. శుక్రవారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తొమ్మిదేండ్ల కాలంలో దళిత జాతులకు రాష్ట్ర ఆవిర్భావ ఫలాలు ఏ ఒక్కటీ దక్కలేదంటూ ట్యాంక్‌ బండ్‌ వద్ద ఉన్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా కృష్ణ స్వరూప్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులకు సామాజిక న్యా యం అందలేదన్నారు. దళితులపై ఆధిపత్య కులాల దాడులు, లైంగిక దాడులు అధికమయ్యాయని తెలిపా రు. దళిత జాతులకు రక్షణ లేకుండా పోయిందనీ, చివరకు ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్‌, కోర్టులు సైతం దళితులకు న్యాయం చేయలేకపోతున్నాయ న్నారు. తెలంగాణ అవతరణతో తమ బతుకులు మా రుతాయని ఆశించారనీ, చివరకు విద్రోహమే జరిగింద న్నారు. సకల సామాజిక అన్ని రంగాల్లో అన్యాయం, ద్రోహమే జరిగిందనీ, తెలంగాణ ఆకాంక్షలు నెరవే రలేదనీ, కేవలం రెండు, మూడు దోపిడీ కులాలే దొరలు, పటేళ్లు, కరణాలు వంటి వారు బాగుపడ్డార న్నారు. మెజార్టీ దళిత బహుజన కులాలు, జాతులకు రాష్ట్రంలో తీరని అన్యాయం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ దళితుడిని తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా చేస్తామని నమ్మించి మోసం చేశారన్నారు. రాజ్యాంగ హక్కులను సైతం సక్రమంగా అమలు చేయలేదన్నా రు. విద్య, వైద్యం, ఆరోగ్యం తెలంగాణలో సామాన్య ప్రజలకు దొరకదన్నారు. ఇవి దశాబ్ది ఉత్సవాలు కాదనీ, దళిత బహుజన జాతులకు విద్రోహం చేసే దొరలు, ఆధునిక పునరేకికరణ ప్రదర్శ నలు అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రజాస్వా మిక లౌకిక కూటమి జాతీయ మీడియా కన్వీనర్‌ శ్యాం కుమార్‌, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అర్షల రాజు, నేతలు సుచంద్రా రావు, సుబ్బారావు, పార్టీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి బీరం సతీష్‌ కుమార్‌, దళిత బహుజన స్టూడెంట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఇటుకల గణేష్‌, పార్టీ గ్రేటర్‌ అధ్యక్షులు మద్దెల ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.