శాస్త్ర విజ్ఞానం తోనే దేశ భవిష్యత్తు..

– ప్రాంతీయ సైన్స్ సెంటర్ ఫీల్డ్ కో-ఆర్డినేటర్ అశోక్ కుమార్
నవతెలంగాణ-ఐనవోలు
పిల్లలలో శాస్త్ర విజ్ఞానం, శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించి వారిలో పరిశోధన పట్ల ఆసక్తిని, అభిరుచిని కలిగించడం లో ప్రాంతీయ సైన్స్ సెంటర్ కృషి చేస్తుంది అని ప్రాంతీయ సైన్స్ సెంటర్ కో-ఆర్డినేటర్ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెంకటాపూర్ లో జాతీయుట సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాస రచన, డ్రాయింగ్గ్ క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు మరియు మండల నోడల్ అధికారి డాక్టర్ తాళ్లపల్లి రమేష్ నుంచే విద్యార్థులలో దైనందిన జీవితం లో ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ ఆలోచనలు ఎంతగానో ఉపకరిస్తాయని జిజ్ఞాస, కుతూహలం, తెలుసుకోవాలనే పట్టుదల నూతన ఆవిష్కరణలకు అంకురార్పణ జరుగుతుందని అన్నారు. దైనందిన జీవితములో విజ్ఞానశాస్త్రం పాత్ర పై వ్యాస రచన పోటీ, నీటిని పొదుపు చేద్దాం- భూమాతను రక్షిద్దాం అనే అంశం పై డ్రాయింగ్ పోటీ, శాస్త్ర సాంకేతికత పై క్విజ్ పోటీ నిర్వహించారు. వ్యాస రచన లో మెటే చైతన్య, వి. కీర్తన, బ్లేస్సి, డ్రాయింగ్ పెయింటింగ్ విభాగములో నిస్సి, కే భాను శ్రీ, కే కీర్తన, క్విజ్ పోటీలో లోకేశ్వర్ రెడ్డి, అక్షయ, వైష్ణవి మొదటి మూడు స్థానాలలో నిలిచారు. ఈ కార్యక్రమాన్ని భాషాబోయిన సాంబయ్య, సత్తు రామనాధం నిర్వహించారు, పోటీలలో గెలుపొందిన విజేతలను పాఠశాల ఉపాధ్యాయులు రాజేందర్ ప్రసాద్, శైలజ, మాధురి, సత్యనారాయణరెడ్డి, సెలీనా, లష్మినారాయణ, ప్రాంతీయ సైన్స్ సెంటర్ రాము నాయక్, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు అభినందించారు.